తమ ఉనికి చాటుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళదాం అనుకున్న వారికి , వస్తే ఒక తంటా రాకపోతే ఒక తంటా అన్నట్టు అయోమయం నెలకొంది.అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆరి తేరిపోయిన నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం ఏ పార్టీలో అయినా చేరేందుకు సిద్ధం అయిపోతున్నారు.అయితే పార్టీలో చేరేముందు తమ డిమాండ్స్ చెప్పి సీటు హామీ పొందుతున్నారు.అయితే అలాంటి నాయకులకు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చెక్ పెడుతున్నాడు.పార్టీలో చేరాలనుకుంటే రండి అంతేకాని టికెట్ హామీ మాత్రం ఇవ్వలేను అంటూ జగన్ వారికి ముందుగానే చెప్పేస్తున్నాడట.పార్టీలోకి వస్తాం అంటున్నవారికి సాదర ఆహ్వానం పలుకుతున్న జగన్ టికెట్ విషయం గురించి కుండబద్దలకొట్టినట్టు చెప్పడం చాలామంది నాయకులకు మింగుడుపడడం లేదు.

అయితే ఇప్పటికే పార్టీలో చేరిన వారు కొందరు తమకు టికెట్ దక్కే అవకాశం లేదని తేలడంతో పక్క చూపులు చూస్తున్నారు.టికెట్ రాకపోతే ఇక మేము ఇందులో ఉండడం ఎందుకు పక్క పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకుంటున్నారు.
ఆఖరికి ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నేత, మాజీ మంత్రి వైసీపీలో చేరినప్పటికీ జగన్ ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి హామీనీ ఇవ్వలేదు.టికెట్ విషయంలో ఎటువంటి భరోసాను కూడా ఇవ్వలేదు.
వస్తే బాగా చూసుకుంటా ఆ తరువాత మీ ఇష్టం అన్ని ఆలోచించుకుని మీకు ఇష్టం అయితే రండి అంటూ జగన్ తన వైకిరిని ఆనం కి చెప్పేసాడు.

అయితే ఆనం కి మరో దారి లేక, టీడీపీలో ఉండలేక, మరో పార్టీలో చేరలేక ఆఖరికి వైసీపీలోకి చేరిపోయాడు.ఎన్నికల నాటికి అవకాశం ఉంటే కచ్చితంగా ప్రాధాన్యతను ఇచ్చే హామీతో ఆనంను జగన్ చేర్చుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు ఎదురు చూస్తున్నప్పటికీ టికెట్ హామీ లేకపోవడంతో డైలమాలో పడ్డారు.
జగన్ ఈ నిర్ణయం వెనుక చాలా పెద్ద కధే ఉందట.వచ్చిన వారిని వచ్చినట్టు ఏదో హామీ ఇచ్చేసి పార్టీలో చేర్చేసుకుంటే ఎన్నికల సమయంలో సీట్ల విషయంలో పెద్ద తలనొప్పి వ్యవహారాలు బయలుదేరతాయి .అవన్నీ పార్టీని దెబ్బతీస్తాయి అనే ముందస్తు ఆలోచనతో జగన్ ఈ విధంగా చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇది వైసీపీలో చేరాలన్న వారికి మాత్రం మింగుడుపడడం లేదు.