మాస్‌ లుక్‌లో యంగ్ హీరో వరుణ్ సందేశ్.. ఆకట్టుకుంటోన్న ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్ లుక్

విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఓ ఇమేజ్ ఏర్పర్చుకున్నారు హీరో వరుణ్ సందేశ్.ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

 Young Hero Varun Sandesh In Mass Look. First Look Of 'yadbhava Tadbhavathy' , Ya-TeluguStop.com

ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు.వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ మరింత కొత్తగా కనిపిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా వరుణ్ సందేశ్ కనిపిస్తున్నారు.ఈ పోస్టర్ చూస్తుంటే వరుణ్ సందేశ్ యాక్షన్ మోడ్‌లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నారు.

పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం సందీప్ కిషన్ మాట్లాడుతూ.

‘మైఖెల్ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా యద్భావం తద్భవతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది.మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.

ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను.ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు.

మాస్‌కు రీచ్ అయ్యేలా ఉంది.’ అని అన్నారు.

వరుణ సందేశ్ మాట్లాడుతూ.‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్.ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, దర్శకుడి గారికి థ్యాంక్స్.ఈ అక్టోబర్ వస్తే హ్యాపీ డేస్ విడుదలై పదిహేనేళ్లు అవుతుంది.

నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

డా.

విక్రమ్ భూమి, దాసరి వెంకేటష్‌లు ఈ కథను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మాస్ ప్రేక్షకులు మెచ్చేలా రచించారు.ఇక ఈ చిత్రానికి శరత్ శ్రీకంఠం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకు మిహిరమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.కళ్యాణ్ శ్యామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

షావోలిన్ మల్లేశ్ ఫైట్ మాస్టర్‌గా, ఆర్ఎం విశ్వనాథ్ కుంచనపల్లి ఎడిటర్‌గా, రాజు అడ్డాల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కొరియోగ్రాఫర్‌గా సురేష్ వర్మ పని చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, ఇనయ సుల్తానా, మాస్టర్ భువన్, శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్, శివారెడ్డి తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube