వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ ,25 లోక్ సభ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాతకంగా అడుగులు వేస్తోంది.ముందుగా పార్టీ కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపి , వారిని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో భారీగా సభలను నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan )జనవరి 27న భీమిలి వేదికగా మొదటి సిద్ధం సభను భారీగా నిర్వహించారు.
ఇక ఆ తర్వాత ఏలూరు జిల్లా దెందులూరు లో అంతకంటే భారీ స్థాయిలో సిద్ధం రెండవ సభను నిర్వహించారు.రాప్తాడు లో నిర్వహించిన సభలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ కావడంతో, తాజాగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి .గుడిపాడు వద్ద ఈరోజు సిద్ధం ఆఖరి సభను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.అద్దంకి నియోజకవర్గం( Addanki Assembly constituency )లో ఉన్న మేదరమెట్ల వద్ద కోల్ కత – చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల మైదానంలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
![Telugu Ap Cm Jagan, Apcm, Ap, Jagan, Janasena, Siddam, Siddam Addanki, Ys Jagan, Telugu Ap Cm Jagan, Apcm, Ap, Jagan, Janasena, Siddam, Siddam Addanki, Ys Jagan,](https://telugustop.com/wp-content/uploads/2024/03/jagan-yv-subbareddy-siddam-meeting-jagan-ap-cm-Jagan-ap-government-siddam-meeting-addanki-TDP-janasena.jpg)
గుంటూరు, బాపట్ల, పల్నాడు ,ప్రకాశం ,నెల్లూరు ,తిరుపతి జిల్లాలలోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు ,నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి రాబోతుండడంతో, దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు.భీమిలి ,దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలు ఒకదాని మించి మరొకటి సక్సెస్ కావడంతో వాటికంటే మరింత భారీగా ఈ సభను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు.జగన్ ఈ సభకు రాబోతుండడంతో భారీగానే బందోబస్తు ఏర్పాట్లు చేశారు .మొత్తం 4200 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.నలుగురు ఎస్పీలు , 14 మంది అడిషనల్ ఎస్పీలు, 21 మంది డిఎస్పీలు , 92 మంది సీఐలు, 252 మంది ఎస్ఐలతో పాటు 400 మంది ఏఆర్ స్పెషల్ ఫోర్స్ 160 మంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.పదివేలకు పైగా బస్సులు ఇతర వాహనాలలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని అంచనాతో 338 ఎకరాలలో 28 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
![Telugu Ap Cm Jagan, Apcm, Ap, Jagan, Janasena, Siddam, Siddam Addanki, Ys Jagan, Telugu Ap Cm Jagan, Apcm, Ap, Jagan, Janasena, Siddam, Siddam Addanki, Ys Jagan,](https://telugustop.com/wp-content/uploads/2024/03/CM-Jagan-Gudipadu-Ys-jagan-yv-subbareddy-siddam-meeting-jagan-ap-cm-Jagan-ap-government-siddam-meeting-addanki-TDP-janasena-BJP.jpg)
ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ సభను నిర్వహించనున్నారు.రాజ్యసభ సభ్యుడు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి విడుదల రజిని , రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు , చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ సభను సూపర్ సక్సెస్ చేసి వైసిపి కి జనాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో నిరూపించుకునేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.