పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..!!

ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఏపీ లో రోడ్ల సమస్య గురించి నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

 Ycp Leader Made Serious Remarks On Pawan Kalyan Sajjala Ramakrishna Reddy, Pawa-TeluguStop.com

ఈ క్రమంలో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తారీకులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే రోడ్ల సమస్యలు ఉన్నాయో వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని పవన్ పిలుపునివ్వడం జరిగింది.అంతమాత్రమే కాకుండా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తారీఖు నుండి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు కార్యక్రమం చేస్తూ శ్రమదానం చేయటానికి రెడీ అవుతాను అంటూ పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై వైసిపి నేత ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు.ఆయన గతంలో జెండా ఎగరవేయడానికి అంతకు ముందు ఏదో కార్యక్రమానికి రాష్ట్రంలో కి వచ్చారు ఎవరో ఏదో రాసిస్తేఆ స్క్రిప్ట్ చెబుతారు.

లేకపోతే ఏదో న్యూస్ పేపర్ లో చూసి మాట్లాడుతారు.అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎక్కడ ఏముందో పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి.ఇటువంటి సమయంలో రోడ్లు మరమత్తు కార్యక్రమం ఎవరు చేయరు.మాన్సూన్ సీజన్ అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగారోడ్ల మరమ్మతులు కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అని.సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.వర్షంలోనే రోడ్ల పని స్టార్ట్ చేయాలి అని ఎవరు అన్నారు.

ఈ వర్షాలు తగ్గిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగారోడ్ల సమస్య ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube