శాండల్ వుడ్ స్టార్ హీరో యష్ గురించి మనందరికీ తెలిసిందే.కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు యష్.
కేజిఎఫ్ సినిమా తర్వాత చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు.అంతేకాకుండా శాండల్ వుడ్ లు అభిమానులు ఎక్కువగా అభిమానించే హీరోలలో యష్ ముందు వరసలో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
యష్ గురించి యష్ భార్య రాధిక పండిట్ గురించి మనందరికీ తెలిసిందే.తాజాగా వీరి యానివర్సరీ సందర్భంగా యష్ భార్య రాధిక పండిట్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేసింది రాధికా పండిట్.ఇది మనమే.
మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండవచ్చు.కానీ ఇది నిజం.
ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు.వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
లవ్ యూ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది రాధిక.ఇకపోతే డిసెంబర్ 9, 2016 న ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ జంటకు ఐరా,యతర్వ్ అనే పాప బాబు కూడా ఉన్నారు.అయితే మొదట వీరిద్దరూ ఒక షూటింగ్ సెట్లో కలుసుకోగా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది.
అయితే స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారంతో ఒకటయ్యారు.ఇకపోతే యష్ ఇటీవల కేజిఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్స్ ను సాధించింది.అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది.ఇక ప్రస్తుతం యష్ విరామం తీసుకుంటున్నారు.ఇకపోతే ఎస్ అభిమానులు కేజిఎఫ్ చాప్టర్ 3 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా యష్ తన తదుపరి సినిమాను దర్శకుడు నర్తన్ తో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే యష్ నటించిన కేజిఎఫ్ 1, కేజీఫ్ 2 సినిమాలు యష్ కి భారీగా పాపులారీటిని తెచ్చిపెట్టాయి.