తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట పటాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
జబర్దస్త్ స్టేజ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే లేడీ కమెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.
ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి 13 వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
అయితే రెండు వారాలు ఫైమా ప్రవర్తన ఆమె వెటకారం వల్ల ఆమె హెల్మెట్ అయి బయటకు రావాల్సి వచ్చింది.అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పైమా బిజీబిజీగా మారిపోయింది.
వరుస ఇంటర్వ్యూలు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆమె ప్రియుడు ప్రవీణ్ ఆమెకు సపోర్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేసిన విషయం తెలిసిందే.
కానీ పైన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఆమెను ప్రవీణ్ కలవకపోవడంతో వారి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయ అన్న అనుమానాలు వచ్చాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రవీణ్ పైమాను కలిసాడు.ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియోలో ప్రవీణ్ ఫైమాతో కలిసి కేక్ కట్ చేయించాడు.అప్పుడు ప్రవీణ్ పై మాతో మాట్లాడడానికి భయంగా ఉంది అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.అనంతరం ప్రవీణ్ కడప దర్గాలో పూజ చేయించిన నీళ్ల బాటిల్ నువ్వు ఫైమా చేతికి ఇచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాడు.
అనంతరం తన మెడలో ఉన్న బంగారు గొలుసుని ఫైమాకు బహుమతిగా ఇవ్వడంతో ఫైమా ఆనందంతో ఉబితబిబ్బైపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.