జనవరి 3న రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

 Yamadonga Tamil Version To Release On January 3-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.అయితే అందరికీ షాకిస్తూ తారక్ నటించిన చిత్రం జనవరి 3న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు మరి ఇంత సడెన్‌గా ఏ సినిమాను రిలీజ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో జనవరి 3న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.12 ఏళ్ల తరువాత ఈ సినిమాను ఇప్పుడెందుకు రిలీజ్ చేస్తున్నారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.

పుష్కర కాలం తరువాత ఈ సినిమాను తమిళ తంబీలు ఎలా ఆదరిస్తారో చూడాలి అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఈ సినిమాతో తమిళనాట తారక్ ఫ్యాన్‌బేస్‌ను మరోసారి ఇంప్రెస్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి యమదొంగ చిత్రం తమిళంలో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube