భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే దూసుకుపోగల సత్తా మెండుగా కలిగి ఉంటారు.ఇది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
భారతీయులు ఉన్న ఆయా దేశాల అధ్యక్షులో లేదా నాయకులో తరుచు ఎదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు.ఎందుకంటే మనోళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆయా దేశ సంస్కృతిలో ఇమిడిపోతారు.
విద్యా,వైద్యం, రాజకీయం ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలలో భారతీయుల ఉనికి ఉండాల్సిందే.ఈ క్రమంలోనే
కెనడా లో ఆల్బర్టా రాష్ట్రంలో మౌలిక వసతుల మంత్రిగా పండా శివలింగ ప్రసాద్ అనే వ్యక్తి నియమితులు అయ్యారు.
గత ఏప్రియల్ లో జరిగిన సాధారణ ఎనికలలో రెండో సారి ఎమ్మెల్యే గా ఎన్నికైన ఆయనా ఇప్పుడు మంత్రి పదవిని చేపట్టారు.గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయన ఉయ్యూరు లో ఇంటర్ విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.
ఆ తరువాత వివిధ సంస్థలలో ఉద్యోగ భాద్యతలు చేపట్టిన ఆయన కెనడాలో ఓ ఆయిల్ కంపెనీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

శివలింగ ప్రసాద్ కెనడా వాసులకి బాగా దగ్గరయ్యారు.మెల్లగా రాజకీయాలవైపు అడుగులు వేశారు.తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం కెనడా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శివలింగ ప్రసాద్ ప్రస్తుతం కెనడాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టి అప్పులు తగ్గించడమే తన టార్గెట్ అంటున్నారు.మన తెలుగు వ్యక్తి ఇలా వేరే దేశంలో మంత్రిగా భాద్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు గుంటూరు వాసులు.







