మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.కొరటాలశివ,చిరు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.‘సైరా’ తరువాత చిరు ఏ చిత్రానికి ఒకే అంటారా అని ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేయబోతున్నారు అన్న వార్త వినగానే ఎగిరిగంతేశారు.దీనితో ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కి త్వరగా షూటింగ్ ముగించుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలో ఈ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కడం అనుమానమే అంటున్నారు.వాస్తవానికి ఈనెల 26 న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఇంకా కూడా పట్టాలెక్కలేదు.
అంతేకాకుండా కొరటాల సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం కావడం తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.మరోపక్క చిరు కూడా ఈ చిత్రం కోసం మరింత బరువు తగ్గే పనిలో పడ్డారు.
సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్దడం కొరటాల శివ స్పెషాలిటీ.ఆయన దర్శకత్వం ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అన్ని కూడా హిట్ లను కొట్టాయి.
ఇప్పుడు శివ దర్శకత్వం లో చిరు నెక్స్ట్ చిత్రం రాబోతుండడం తో అభిమానులు భారీ అంచనాలను ఏర్పరచుకున్నారు.దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్.
ఇందులో చిరంజీవి.దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించబోతుండగా, చాలా కాలం తర్వాత మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండడం విశేషం.ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించి కంటిన్యూగా 90 రోజుల్లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై అభిమానులు మాత్రం చాలా అంచనాలను నమోదు చేసుకున్నారు.ఈ చిత్రానికి టైటిల్స్ కూడా రెండు మూడు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.







