ఈ ఏడాది జూన్‌లో బ్రెజిల్ దేశంలో నెలూర్ జాతి (Nelore breed)కి చెందిన ఓ ప్రత్యేక రకం ఆవు రికార్డు స్థాయిలో ధర పలికింది.వేలంలో ఈ ఆవును ఏకంగా రూ.35 కోట్లకు విక్రయించారు, అంటే ఆ మొత్తంతో పెద్ద ప్యాలెస్ కొనుగోలు చేయవచ్చు.లేదంటే ఒక పెద్ద డెయిరీ ఫామే ఏర్పాటు చేయొచ్చు.
ప్రకాశవంతమైన తెల్లటి బొచ్చు, భుజాలపై మూపురం ఉన్నందున ఈ ఆవు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది.
నెలూర్ జాతి భారతదేశంలోని నెల్లూరు జిల్లా అని పిలిచే ప్రదేశం నుంచి వచ్చింది.ఇది బ్రెజిల్‌లో( Brazil ) సూపర్ పాపులర్ అయ్యింది.ఎందుకంటే ఇది లో-క్వాలిటీ గల ఆహారాన్ని తినగలదు.
అయినా ఆరోగ్యంగా ఉండగలదు.ఎక్కువగా పాలు ఇస్తుంది కూడా.
ఈ ఆవు పేరు వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్.( Viatina-19 FIV Mara Imóveis ) దాని వయస్సు నాలుగున్నర సంవత్సరాలు.ఇది రోజూ 15 లీటర్ల హై క్వాలిటీ పాలు ఇస్తుంది.2022 సంవత్సరంలో, ఒక ఆవును దాదాపు 800,000 డాలర్లకు విక్రయించారు.ఇది అప్పట్లో రికార్డు.దాని కంటే ముందు 2021లో ఓ ఆవు గతంలో రూ.29 కోట్లకు అమ్ముడుపోయి భారీ రికార్డు నెలకొల్పింది.
ఆ తర్వాత, ఈ ఏడాది జూన్‌లో, అదే జాతి ఆవులో మూడింట ఒక వంతు ఓనర్ అయిన ఓ వ్యక్తి దానిని 1.44 మిలియన్ డాలర్లకు (అంటే దాదాపు 11 కోట్లు) విక్రయించారు.దీనర్థం ఈ ప్రత్యేక ఆవు మొత్తం విలువ 4.3 మిలియన్ డాలర్లు, ఇది వేలంలో ఆవుకి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర.అదీ అద్భుతమైన నెల్లూరు జాతి ఆవు కథ!
.