వరల్డ్ కప్ 2024: మహిళల టి20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.

బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే మహిళల టి20 ప్రపంచ కప్( Women’s T20 World Cup ) 2024 సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ( ICC ) విడుదల చేసింది.అక్టోబర్ 3 నుండి ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది.

 World Cup 2024 Women's T20 World Cup Schedule, T20 World Cup 2024, Womens World-TeluguStop.com

మొత్తం ఈ టోర్నీలో 23 మ్యాచులు అక్టోబర్ 20 వరకు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా మొత్తం పది జట్లు ఈ ప్రపంచకప్ కోసం పోటీ పడనున్నాయి.

ఈ వరల్డ్ కప్ సంబంధించి ఇప్పటికీ ఎనిమిది జట్లు అర్హత సాధించగా.మరో రెండు జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా పోటీలో పాల్గొనబోతున్నాయి.

ఈ క్వాలిఫై రౌండ్లు ముగిసిన తర్వాత మొత్తం పది జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు.ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉన్నాయి.గ్రూప్ A లో.భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ తోపాటు క్వాలిఫైయర్ 1( Qualifier 1 ) జట్లు ఉంటాయి.అలాగే గ్రూప్ B లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్వాలిఫైయర్ 2 జట్లు ఉండబోతున్నాయి.

Telugu Bangaldesh, India, Cup, Teamindia, Womens Cup, Cupwomens-Latest News - Te

ఈ టోర్నమెంట్లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ను అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో తలపడనుంది.ఆ తర్వాత అక్టోబర్ ఆరున చిరకాల పద్ధతులైన పాకిస్తాన్, భారత్ జట్లు తలపడునున్నాయి.ఇక ఫైనల్, సెమీఫైనల్స్ కు గాను రిజర్వ్ డేలను ఉంచారు.

ఇక ఈ టోర్నమెంట్ లోని మ్యాచ్ల షెడ్యూల్ ఇలా ఉన్నాయి.

Telugu Bangaldesh, India, Cup, Teamindia, Womens Cup, Cupwomens-Latest News - Te

అక్టోబర్ 3 – ఇంగ్లాండ్‌ vs సౌతాఫ్రికా – ఢాకా వేదిక‌ అక్టోబర్ 3 – బంగ్లాదేశ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 4 – ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 4 – భారత్ vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 5 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 5 – బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ – ఢాకా అక్టోబర్ 6 – న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 6 – భారత్ vs పాకిస్థాన్ – సిల్హెట్ అక్టోబర్ 7 – వెస్టిండీస్ vs క్వాలిఫయర్ 2 – ఢాకా అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – సిల్హెట్ అక్టోబర్ 9 – బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 9 – భారత్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 10 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 11 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 11 – పాకిస్థాన్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 12 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 12 – బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా – ఢాకా అక్టోబర్ 13 – పాకిస్థాన్ vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 13 – భారత్ vs ఆస్ట్రేలియా – సిల్హెట్ అక్టోబర్ 14 – ఇంగ్లండ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 17 – మొదటి సెమీ-ఫైనల్ – సిల్హెట్ అక్టోబర్ 18 – రెండవ సెమీ-ఫైనల్ – ఢాకా అక్టోబర్ 20 – ఫైనల్ – ఢాకా

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube