ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది.అయితే, ఎయిర్‌టెల్, జియో, వీఐ ప్లాన్‌లలో ఏది ది బెస్ట్ ప్లాన్ అయి ఉంటుందో తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్…
ముఖ్యంగా ప్రతిరోజూ 2 జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది మంచి ప్లాన్.డేటాతో పాటు అపరిమిత కాల్స్ ఇతర యాప్ సబ్‌స్ట్రిప్షన్స్ కూడా లభిస్తాయి.దాంతోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.దీని వ్యాలిడిటీ 56 రోజులు వర్తిస్తుంది.అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ కూడా ఉచితం.ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం, వింక్ మ్యూజిక్ కూడా ఫ్రీగా పొందవచ్చు.
జియో బెనిఫిట్స్.

ఇక జియో రూ.444 ప్లాన్‌తో అపరిమిత కాల్స్‌తోపాటు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.ప్రతిరోజూ 2 జీబీ డేటా. మొత్తంగా 112 జీబీ డేటా లభిస్తుంది.దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు.వ్యాలిడిటీ 56 రోజులు.ఇలాంటి బెనిఫిట్స్ మాదిరిగానే మీకు రూ.249 ఎయిర్‌టెల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది.కానీ దీని వ్యాలిడిటీ 28 రోజులు వర్తిస్తుంది.జియో ప్లాన్‌లో కూడా 2 జీబీ డేటా అందిస్తుంది.అపరిమిత కాలింగ్ బెనిఫిట్ పొందవచ్చు.మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది.ఇక జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడంతో పాటు ప్రతిరోజూ వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.
వీఐ డబుల్ ధమాకా.

వీఐ ప్లాన్ రూ.449… వొడాఫోన్ ఐడీయా (వీఐ) రూ.449 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్ బెనిఫిట్స్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లాన్‌లో డబుల్ డేటా ఆఫర్ వస్తుంది.
అంటే వీఐ వినియోగదారులకు ప్రతిరోజూ 4 జీబీ డేటా లభిస్తుంది.దీని వ్యాలిడిటీ కూడా 56 రోజులు.
ఈ వీఐ ప్లాన్‌లో వీకెండ్ రోలొవర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.