టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇక ఈ బ్యూటీకి టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుంది.
నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో 2003లో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
అలా వరుస సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక నాయకి అనే సినిమాతో చివరిసారిగా నటించి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి తమిళం వైపు అడుగులు వేసింది.
ఇక మళ్లీ రీ ఎంట్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇదంతా పక్కన పెడితే బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.
ఇప్పటికే నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఉన్న ఈ బ్యూటీ ఇంకా తన అందంతో మెప్పిస్తూనే ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈమె పెళ్లి గురించి ఎన్నో పుకార్లు వినిపించాయి.
అంతేకాకుండా గతంలో వరుణ్ మణియన్ అనే ఓ బిజినెస్ మాన్ ను నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కొన్ని మనస్పర్థలతో తమ పెళ్ళి కూడా రద్దు చేసుకున్నారు.ఇక తాజాగా ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ ను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ డైరెక్టర్ పేరు బయటకు రాకపోగా.ఓ సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య పరిచయం పెరగడంతో.అలా అతని మాయలో పడిందట త్రిష.ఇక తమ ప్రేమ బంధం త్వరలో పెళ్లి గా మారనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం గురించి త్రిష ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తుంది.
పైగా అవకాశాలు కూడా అందుకుంటుంది.