ఔనువాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే...?

వంశీ డైరెక్షన్ లో రవితేజ( Ravi Teja ) హీరోగా, కళ్యాణి హీరోయిన్ గా వచ్చిన సినిమా ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది.

 Who Is That Star Hero Who Missed The Movie Avunu Valliddaru Ista Paddaru , Jagap-TeluguStop.com

వంశీ చాలా రోజుల తరువాత డైరెక్షన్ చేసిన సినిమా ఇది అందుకే ఈ సినిమా మీద ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నట్లుగా ఈ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది.అయితే ఈ సినిమా విజయం లో వంశీ గారి పాత్ర చాలా ఎక్కువ అనే చెప్పాలి.రవితేజ కంటే ముందే ఈ సినిమాలో హీరోగా వేరే వాళ్ళని పెడుదాం అని డైరెక్టర్ వంశీ అనుకున్నారట కానీ అది కుదరలేదు ఇంతకు ఆ హీరో ఎవరు అంటే జగపతి బాబు మంచి ఫ్యామిలీ హీరో గా గుర్తింపు పొందిన జగపతి బాబు( Jagapathi babu )కి వంశీ కథ చెబితే కథ నచ్చలేదో లేక వంశీ గారి డైరెక్షన్ మీద నమ్మకం లేదో కానీ మొత్తానికి ఈ సినిమా చేయలేదు…

ఇక ఆ తరువాత వంశీ గారు రవితేజ తో చేద్దాం అనుకోని ఆయనకి కథ చెప్పి ఆయన్ని ఒప్పించి ఆ తరువాత హీరోయిన్ గా కళ్యాణి గారిని తీసుకున్నారు.ఈ సినిమా మంచి విజయం సాధించింది దాంతో వంశీ గారు మళ్లీ ఇండస్ట్రీ కి రావడానికి ఆయనకి ఒక నమ్మకాన్ని ఇచ్చిన సినిమా అనే చెప్పాలి.

 Who Is That Star Hero Who Missed The Movie Avunu Valliddaru Ista Paddaru , Jagap-TeluguStop.com

ఆయన రాసుకున్న స్టోరీ ని తెర మీద చూపించి జనాల చేత శభాష్ అనిపించుకున్నారు ఇక ఆ తరువాత ఆయన ఇంకొన్ని సినిమాలు చేసారు అవి అనుకున్నంతగా ఆడలేదు అనే చెప్పాలి అయితే ఈ సినిమాకి మరో ముఖ్యమైన హైలెట్ ఏంటంటే చక్రి గారి మ్యూజిక్ ప్రతి పాట ఒక్కో వెరిషన్ లో మ్యూజిక్ అసలు మాములుగా ఇవ్వలేదు చక్రి… అప్పుడు రవితేజ సినిమాలకి వరుసగా చక్రి నే మ్యూజిక్ ఇస్తూ ఉండేవాడు…ఇక ఈ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర అనే సినిమా చేస్తున్నాడు అలాగే ఇంకో రెండు సినిమాలని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube