ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి లోను చేస్తోంది.తాజాగా వాట్సాప్‌లో ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని మెరుగుపరుస్తోంది.
వాట్సాప్ ద్వారా 2 జీబీ వరకు ఫైల్ షేర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.దీనికి ఎస్టిమేటెడ్ టైమ్ అనే ఫీచర్‌ను జోడించింది.
ఫలితంగా యూజర్లు సదరు ఫైల్‌ను షేర్ చేసేందుకు పట్టే సమయం గురించి తెలుసుకోవచ్చు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఫొటోలు, వీడియోల తక్కువ సైజులో ఉన్నప్పుడు వాటిని ఇతరులకు వాట్సాప్ ద్వారా పంపేందుకు ఎక్కువ సమయం పట్టదు.కానీ 2GB పరిమాణంలో ఉన్న ఫైల్ల విషయానికి వస్తే అప్లోడ్, డౌన్లోడ్ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది.
అందువల్ల డౌన్లోడ్ స్పీడ్‌ను పరిగణనలోకి తీసుకొని వినియోగదారులు వారు ఎదురుచూస్తున్న ఫైల్‌పై ETA(estimated time of arrival) పొందడానికి సహాయపడే ఒక ఫీచర్‌పై వాట్సాప్ ప్రస్తుతం పని చేస్తోంది.డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం బీటాలో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
వాట్సాప్ వివిధ ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెండు ఫీచర్లపై పని చేస్తోంది.

డెస్క్‌టాప్ కోసం, ఐఓఎస్ వినియోగదారుల కోసం పరీక్షిస్తున్నారు.టెస్టింగ్ దశలో ఉన్నందు ప్రస్తుతానికి ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం యూజర్లు అందరికీ ఇంకా అందుబాటులో లేవు.మరోవైపు, వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది.
వాట్సాప్‌లో యూజర్లు వినియోగించే మెసేజ్ రియాక్షన్స్, పోల్స్‌ను కూడా డెవలప్ చేస్తోంది.రానున్న కాలంలో మరిన్ని ఆసక్తికర ఫీచర్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
వీటితో పాటు లైక్, లాఫ్, సర్ప్రైజ్, లవ్, థాంక్స్, సాడ్ వంటి రియాక్షన్లను మరింత అభివృద్ధి చేస్తోంది.