ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఓ వార్త చలం సృష్టిస్తోంది.ఇప్పుడు ఏపీలో అతి పెద్ద హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం కంటే కూడా, అధికారంలోకి రాకపోతే ఆయా పార్టీల మనుగడ ఎలా ఉండబోతోంది.?? ఓడిన పార్టీ అధినేతల పరిస్థితి ఏమిటి.?? అనే విషయంపై ఏపీ జనం తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారట.ఈ విషయంపై ప్రజలు మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం తమ తమ అంచనాలను వ్యక్తపరచడం మరింత సంచలనం సృష్టిస్తోంది.
ఇంతకీ ఏపీలో అధికారంలోకి రాకపోతే ఆ ముగ్గురు అధినేతల పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే విశ్లేషణ లోకి వెళ్తే.

ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ జనసేన ఊహించని రీతిలో అధికారంలోకి వస్తుందని ఎవరూ భావించటం లేదు.ఈ విషయం కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తపరచటం అందరికీ తెలిసిందే.అయితే జనసేన గనుక అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే సినిమా రంగంలోకి వెళ్లిపోతాడని, తన రంగంలో ఉంటూనే పార్టీకి ఆర్థిక వనరులు చేకూర్చుతూ జనసేన ను ముందుకు నడుపు తాడని అంటున్నారు విశ్లేషకులు.
ఇదిలా ఉంటే అధికారం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్ గనుక ఓడిపోతే.

ఇప్పటికే ఆర్ధిక భారంతో , ఈడీ కేసులతో సతమతమవుతూ మరోపక్క పార్టీని నడుపుతూ, ఇంకోపక్క సాక్షి పేపర్ ని మీడియాని సజావుగా సాగేలా చూసుకుంటూ, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జగన్ రెడ్డికి గనుక అధికారం రాకపోతే వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైతే టిడిపి, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ గూటికి చేరిపోయారో, అలాగే ఏపీలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి వైసీపీ నేతలు వెళ్లిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి గనుక రాకపోతే.ఇప్పటికే ఎంతోమంది గెలుపు గుర్రాలను పోగొట్టుకున్న చంద్రబాబు, అధికారం చేజిక్కించుకున్న పార్టీలోకి మరింత మంది టీడీపీ నేతలు చేరిపోయి పార్టీ కుదేలవడం ఖాయం అని అంటున్నారు.చంద్రబాబుకు వయసు మీద పడటంతో మునుముందు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన లేకపోవడం, పార్టీని ముందుకు నడిపించే సరైన నాయకుడు బాబు తర్వాత లేకపోవడంతో.అధికారంలోకి వచ్చిన పార్టీ లోకి వలసలు వెల్లువలా వెళ్లి చేరుకుంటాయని , చివరికి పార్టీని నడిపేవారు లేక మరోసారి టీడీపీ ఎన్ఠీఆర్ కుటుంబం చేతికి మరోమారు వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.