ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగారా..అయితే జైలుకు వెళ్లాల్సిందే!

సాధారణంగా మనం చదువుకున్న చదువు ఏ స్థాయిలోది అయినా కూడా జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్లాల్సిందే.అలా ఇంటర్వ్యూ కి వెళ్తేనే మనకు తగిన ఉద్యోగం లభిస్తుంది.

 What Can Employers Not Ask In An Interview America,5 Questions Cant Ask, Intervi-TeluguStop.com

అయితే ఇలా ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసే వారు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు.అందులో కొన్ని పర్సనల్ ప్రశ్నలు కూడా ఉంటాయి.

అయితే మన ఇండియాలో ఎలాంటి ప్రశ్నలు వేసిన ఏమీ అనలేము.కానీ అమెరికాలో అలా కాదట.

అమెరికాలో ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగకూడదని రూల్ ఉందట.ఏ ఇంటర్వ్యూ లలో కూడా పర్సనల్ విషయాలను అడగకూడదట.

అలా అడిగితే వారిపై కేసు కూడా పెట్టవచ్చట.అమెరికా ఫెడరల్ లా ప్రకారం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ప్రశ్నలు అడగడం చట్టరీత్యా నేరం.

అయితే ఆ రూల్ గురించి అక్కడ చాలా మందికి తెలియదట.అక్కడ పౌరులకు హక్కుల గురించి సరిగా తెలియకపోవడం వల్లనే అని నిపుణులు చెబుతున్నారు.

అయితే అక్కడి చట్ట ప్రకారం వ్యక్తిగతంగా ఏమేమి ప్రశ్నలు అడగకూడదో తెలుసుకుందాం.

మతం గురించి అడగడం : అమెరికన్ చట్టం ప్రకారం ఇంటర్వ్యూ కి వచ్చిన అభ్యర్థిని మీరు ఏ మతానికి చెందిన వారు అనే ప్రశ్న అడగకూడదట.ఇది పూర్తిగా నిషేధం.మతం ఆధారంగా వివక్షతకు గురి అవుతారని అలా ఎవరిపైన వివక్షత చూపకుండా మతానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం చట్ట బద్ధంగా నేరం.

వయసు :

1967 ADEA చట్ట ప్రకారం అమెరికాలో ఏ ఇంటర్వ్యూలో కూడా 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తిని వయసుకు సంబంధించిన ప్రశ్న అడగకూడదట.ఈ ప్రశ్న అడగడం నేరం అట.ఎందుకంటే తక్కువ వయసు వారికే ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి అలాంటి వివక్షత ఉండకూడదనే ఈ నిబంధన అమలులోకి వచ్చిందట.

ప్రెగ్నెన్సీ :

ఏ మహిళను వైవాహిక లేదా గర్భధారణ విషయంపై వివక్షతకు గురి కాకూడదు అని ప్రెగ్నెన్సీ యాక్ట్ కింద ఏ యజమాని కూడా ప్రెగ్నన్సీ గురించి ఆమెను ఉద్యోగం నుండి తీయకూడదు.అందుకు సంబంధించిన ప్రశ్నలు కూడా వేయకూడదు.ఏ మహిళ అయినా ఇలాంటి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే ఆమె కోర్టుకు వెళ్లి సదరు యజమానికి శిక్ష వేయించవచ్చట.

పౌరసత్వం :

పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ ను ఆధారంగా తీసుకుని అమెరికాలో ఉద్యోగిపై వివక్ష చూపకూడదట.ఇది చట్ట రీత్యా నేరం.

ఉద్యోగానికి ఎంపిక అయిన తరువాత పౌరసత్వం ప్రశ్నలు అడగవచ్చు.

No employer in America ask these questions in Interview

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube