ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీకి జనాల్లో ఇప్పుడు ఆదరణ ఉందంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం వైసీపీ పేరే.దానికి ఉదాహరణగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న వరుస ఎన్నికల ఫలితాలను చూస్తుంటనే అర్థం అవుతుంది.
ప్రతి ఎన్నికల్లో వైసీపీ ఎవరి అంచనాలకు అందకుండా అద్భుత ఫలితాలను సాధిస్తోంది.ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తోంది.
మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు మాత్రం రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ బల్ల గుద్ది చెబుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో జగన్ మాజీ సీఎం అవుతారంటూ ప్రకటించేస్తున్నాయి.
మొన్నటికి మొన్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అయినటుంటి విష్ణు కుమార్ రాజు కూడా ఇదే విధంగా జోస్యం చెబుతున్నారు.ఏపీ ప్రజలు జగన్ని ఎన్నుకుని బాధ పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమంటూ చెబుతున్నారు.
ఇకపోతే టీడీపీ అధినేత కూడా వీర లెవెల్లో ధీమాను చూపిస్తున్నారు.అప్పుడే ఆ పార్టీలో రాబోయే ఎన్నికల తర్వాత మంత్రి పదవుల ఎవరికి అంటూ హడావుడి మొదలెట్టిన వారూ కూడా ఉన్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక తానే హోమ్ మినిస్టర్ అంటూ అప్పుడే అచ్చెన్నాయుడు లాంటి వారు చెప్పేశారు.

ఇక పవన్ కల్యాణ్ కూడా 151 సీట్లతో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే సీట్లు కూడా రావంటూ ప్రకటించేస్తున్నారు.ఈ విధంగా విపక్షాలు అధికారంలోకి రాబోతోంది తాము అంటూ ఉత్సాహం చూపిస్తున్నారు.నమ్మకం మంచిదే కానీ మితిమీరిన నమ్మకం ప్రదర్శిస్తేనే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎన్నికలతో పాటు మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తిరుగు లేని మెజార్టీని దక్కించుకున్న వైసీపీని ఓడించడం అంత ఈజీ కాదు.ఇంకో రెండేండ్లలో జగన్ మీద అంత వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా పెద్దగా లేదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
.