శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే?

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విల‌యతాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.మన దేశంలోనే రోజుకు మూడు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు అవుతున్నాయంటే.

 What Are The Best Foods That Increase The Level Of Oxygen In The Body, Best Food-TeluguStop.com

ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.మ‌ర‌ణాలు కూడా రోజు రోజుకు భారీగా న‌మోదు అవ‌తున్నాయి.

అయితే క‌రోనా సెకెండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొర‌త ఏర్ప‌డ‌టం వ‌ల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయి.దీంతో ఇప్పుడు అంద‌రూ ర‌క్తంలో ప‌డిపోయిన ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను మ‌ళ్లీ పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా ఆక్సిజ‌న్ స్థాయిని పెంచుకోవ‌చ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

కివి పండు. దీనిని రెగ్యుల‌ర్ తీసుకుంటే అందులో పుష్ప‌లంగా ఉండే విటిమ‌న్ సి మ‌రియు ఇత‌ర పోష‌కాలు శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Telugu Foods, Coconut, Corona, Covid, Cucumber, Tips, Oxygen Level, Kiwi Fruit,

అలాగే చిలగడదుంప కూడా ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు.చిల‌గ‌డ‌దుంప‌లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్ మ‌రియు ప్రోటీన్స్ అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంతో పాటు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను కూడా పెంచుతుంది.దోస‌కాయ తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.దోస‌కాయ‌లో వాట‌ర్ కంటెంట్‌తో పాటు కొన్ని ముఖ్య‌మైన పోష‌కాలు ఉండ‌టం వ‌ల్ల‌.ర‌క్తంలో ప‌డిపోయిన ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ మ‌ళ్లీ పెరుగుతాయి.

నిమ్మపండును ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

ఇలా చేస్తే.అందులో ఉండే విట‌మిన్ సి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి.

ఇక వీటితో పాటు క్యారెట్‌, మెల‌కెత్తిన గింజ‌లు, పెరుగు, కొబ్బ‌రి నీరు, అర‌టి పండు వంటివి కూడా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube