ఏపీలో బిజెపి మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చినా , కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ఏపీలో బలపడేందుకు మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశాలు దక్కడం లేదు .దీనికి కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడమే అనేది బీజేపీ నాయకుల అభిప్రాయం.
అయినా ఇందులో వాస్తవం ఉంది.ఇప్పుడు ఏపీలో బలపడేందుకు బీజేపీ కి అవకాశాలు ఉన్నా, వాటిని చేజేతులా ఆ పార్టీని నాశనం చేసుకుంటుంది అన్నట్లుగా ఏపీ బీజేపీ పరిస్థితి కనిపిస్తోంది.
గత బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణ టిడిపి అనుకూలంగా వ్యవహరించడం, చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కోవడం వంటి కారణాలతో ఆగ్రహం చెందిన బిజెపి అధిష్టానం పెద్దలు, ఆయనను తప్పించి ఆయన స్థానంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టారు .
ఆయన ఆ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేశారు. కరుడుగట్టిన బీజేపీ వాదులు మాత్రమే ఉండాలని , మిగతా వారికి అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారు.తన వర్గం నాయకులందరికీ పార్టీలో కీలక పదవులు అప్పగించారు.పూర్తిగా బిజెపిలో ఉండేలా చేసుకున్నారు.బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీ బిజెపికి సపోర్ట్ దొరికింది.
అలాగే జనసేన పార్టీ తో పొత్తు కూడా బాగా కలిసి వచ్చింది.అయితే కొంతకాలంగా సోము వీర్రాజు సైలెంట్ అయిపోవడం, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో ను పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టుగా కనిపించకపోవడం, ఇప్పటికీ మౌనంగానే ఉండడం వంటి వ్యవహారాలతో వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్నారు అని, అధిష్టానం పెద్దలు ఆయన స్థానంలో మరొకరిని నియమించాలి అనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది .దీంతో ఏపీ బిజెపి లో వచ్చిన ఆ కాస్త ఊపు కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.

ప్రస్తుతం కరోనా ఏపీలో విజృంభిస్తోంది.ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంపై టిడిపి గట్టిగా పోరాడుతోంది.కానీ ఎక్కడా బిజెపి ఈ విషయంలో స్పందించడం లేదు .అలాగే కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏపీకి ప్రయోజనం చేకూరే విధంగా ఉండడం, తగిన సహాయం ఏపీకి చేయడం ఇవన్నీ ఏపీ బిజెపి నేతలు ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారు.సోము వీర్రాజు మౌనంగా ఉండడం కారణంగానే ఈ స్తబ్దత ఏపీ బిజెపిలో బాగా కనిపిస్తోంది.