వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కొద్దిగా పుంజుకోవడం జరిగింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.ఆ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది.
గత ఏడాది కర్ణాటక, తెలంగాణ( Karnataka, Telangana ) అసెంబ్లీ ఎన్నికలలో.కాంగ్రెస్ విజయం సాధించింది.
దక్షిణాదిలో కాంగ్రెస్ మళ్లీ పునర్వైభవం దిశగా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్.
నేత మేనిఫెస్టో కమిటీ సారధి పి.చిదంబరం ( Chidambaram )కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో పై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి రాష్ట్రంలో ప్రజలతో సంప్రదింపులు జరిపి మేనిఫెస్టోలో వీలైనంత ఎక్కువమంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు.ఇదే సమయంలో awaazbharatki.in లేదా [email protected] కి మెయిల్ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.
అయితే సలహాలు ఇవ్వాలనికున్నేవాళ్ళు పేరు మరియు మొబైల్ నెంబర్లు, పిన్ కోడ్ లు నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్( Congress ) ఎలాంటి నిర్ణయం తీసుకున్న ప్రజాభిప్రాయం ప్రకారమే తీసుకుంటుందని చిదంబరం వివరించారు.