విరాటపర్వం సినిమాని ఆ ఒక్కరి కోసమే చేశా... రానా కామెంట్స్ వైరల్!

రానా దగ్గుబాటి హీరోగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

 Virataparvam Movie Was Made Just For That One Rana Comments Viral, Virataparvam,-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్రబృందం ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఇకపోతే తాజాగా ఆదివారం సాయంత్రం వరంగల్లో విరాట పర్వం సినిమా ఆత్మీయ వేడుకను జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా చిత్రబృందం పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ ఆత్మీయ వేడుకల్లో భాగంగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ నేను ఈ సినిమాలో నటించినందుకు చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు.మీరు ఎందుకు ఈ సినిమాలో నటించారు? ఏదైనా యాక్షన్ సినిమా చేయొచ్చు కదా అంటూ తనని అడుగుతున్నారని చెప్పిన రానా, ఈ సినిమా ఎందుకు చేశారో కూడా వెల్లడించారు.సాధారణంగా సినిమా అభిమానుల కోసం ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాము.

Telugu Posters, Rana, Sai Pallavi, Teaser, Telugu, Tollywood, Virataparvam-Movie

ఈ విధంగా థియేటర్లో చప్పట్లు కొడుతూ ఉండగా ఆ చప్పట్ల మధ్య లో నిశ్శబ్దంగా కూర్చుని ఇది నిజమే కదా అని నమ్మి ఒకరు సినిమా చూస్తుంటారు ఆ ఒక్కరి కోసమే తాను ఈ సినిమాలో నటించానని ఈ సందర్భంగా విరాట పర్వం సినిమా గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో సందడి చేయనున్నారు.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube