నీది నాది ఒకటే కథ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రచయిత వేణు ఊడుగుల.ఈ టాలెంటెడ్ దర్శకుడు మొదటి సినిమాకే మంచి చదువు గురించి నేటి యువతరంకి కనెక్ట్ అయ్యే కథాంశం తీసుకొని తెరపై ఆవిష్కరించి హిట్ కొట్టాడు.
దీంతో రెండో సినిమా అవకాశం రానా ఇచ్చాడు.ఇక కెరియర్ విభిన్న కథలతో సినిమాలు చేస్తున్న క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని సైతం తన కథతో వేణు ఊడుగుల మెప్పించాడు.
అలాగే ప్రియమణి, నందితాదాస్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ని సెలక్ట్ చేసుకొని విరాటపర్వం అనే టైటిల్ తో సినిమాని ఆవిష్కరిస్తున్నారు.ఒకప్పుడు నక్సలిజం కథలకి మంచి డిమాండ్ ఉండేది.
విప్లవ కథలని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.చాలా కాలంగా అలాంటి కథలని దర్శకులు టచ్ చేయడం లేదు.
అయితే ఇంత మంది టాలెంటెడ్ నటులని తీసుకొని వేణు ఊడుగుల నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక విప్లవ కథని విరాటపర్వం ద్వారా చెప్పబోతున్నాడు.

ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అలాగే సినిమాలో రానా, ప్రియమణి, సాయి పల్లవి పాత్రలకి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసి తాను చెప్పబోయే కంటెంట్ ఏంటి అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.దీంతో సినిమాపై ప్రస్తుతం ఒకొంత హైప్ క్రియేట్ అయ్యి ఉంది.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా చివరి షెడ్యూల్ వాయిదా పడిపోయింది.మళ్ళీ ఈ ఫైనల్ షెడ్యూల్ ని దర్శకుడు వేణు తాజాగా స్టార్ట్ చేశాడు.
ప్రస్తుతం రాత్రి సమయంలో షూటింగ్ జరుగుతుందని, ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తయిపోతుందని నిర్మాత మీడియాతో పంచుకున్నాడు.సరికొత్త కథాంశంతో పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలియజేశాడు.