సచిన్ రికార్డును సమం చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న కోహ్లీ.. శ్రీలంక లక్ష్యం 358 పరుగులు..!

వాఖండే వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక మ్యాచ్ లో ( India vs Sri Lanka ) కేవలం 12 పరుగుల తేడాతో విరాట్ కోహ్లీ( Virat Kohli ) సెంచరీ మిస్ చేసుకున్నాడు.దీంతో సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) రికార్డ్ సమం చేసే ఛాన్స్ కోల్పోయాడు.

 Virat Kohli Missed The Chance To Break Sachin Tendulkar Record Details, Virat Ko-TeluguStop.com

ఈ మ్యాచ్ లో సెంచరీ తో అదరగొడతారని ఎంతో ఆశించిన క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది.గత ఏడు మ్యాచ్లలో చూసుకుంటే సెంచరీ మిస్ అవ్వడం ఇది మూడవసారి.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో 85 పరుగులు చేశాడు.న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో 95 పరుగులు చేశాడు.

తాజాగా శ్రీలంక మ్యాచ్ లో 88 పరుగులు చేశాడు.ఇక విరాట్ కోహ్లీ సెంచరీ కోసం క్రికెట్ అభిమానులు నవంబర్ 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Telugu Cricket Cup, Gill, India Sri Lanka, Rohit Sharma, Tendulkar, Virat Kohli,

తాజాగా జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే.టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 357 పరుగులను చేసింది.కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) మొదటి ఓవర్ లోనే పెవీలియన్ చేరాడు.గిల్, కోహ్లీ అద్భుత ఆట ప్రదర్శన చేశారు.భారత్ రెండో వికెట్ కోల్పోయే నాటికి స్కోర్ 193 పరుగులు.గిల్( Gill ) 92 బంతుల్లో 92 పరుగులు, కోహ్లీ 94 బంతుల్లో 88 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు.

ఇక శ్రేయస్ అయ్యర్ కూడా ఫుల్ ఫామ్ కొనసాగించి కేవలం 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు.

Telugu Cricket Cup, Gill, India Sri Lanka, Rohit Sharma, Tendulkar, Virat Kohli,

చివర్లో రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 35 పరుగులు చేయడంతో.శ్రీలంక ముందు 358 పరుగుల లక్ష్యం ఉంచారు.భారత బ్యాటర్ల దాటికి శ్రీలంక బౌలర్లు చేతులెత్తేస్తే.

కేవలం ఒకే ఒక శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుశంక కీలకమైన సమయాలలో భారత జట్టులో ఉండే కీలక ఐదు వికెట్లు తీసుకున్నాడు.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతమైన ఆటనే ప్రదర్శించారు.

ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత పేసర్లు, స్పిన్నర్లు ఎంతవరకు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేసి భారత్ ఖాతాలో ఏడో విజయం వేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube