విరాట్ కోహ్లీ బౌండరీలు బాదడంలోనే కాదు క్యాచ్లు పట్టడంలోనూ అరుదైన రికార్డు..!

విరాట్ కోహ్లీ( Virat Kohli ) అద్భుత ఆట ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే.గత దశాబ్ద కాలంగా భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

 Virat Kohli Creates Record With Catches Details, Virat Kohli , Virat Kohli Recor-TeluguStop.com

ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు.

క్రికెట్ లో ఎంతోమంది క్రియేట్ చేసిన రికార్డులను అలవొకగా విరాట్ కోహ్లీ చేదిస్తున్నాడు.

ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెటర్లతో పోల్చుకుంటే ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తూ చూసే వారందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు.

ఇక సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్నంత పాపులారిటీ, ఫాలోవర్లు మరే ఇతర స్టార్ క్రికెటర్ కు కూడా లేరు.

Telugu Catches, Ind Wi Odi, Jayawardene, Ricky, Virat Kohli, Viratkohli-Sports N

భారత జట్టు ఫీల్డింగ్( Fielding ) చేస్తున్న సమయంలో బంతి విరాట్ కోహ్లీ వైపు వెళ్లిందంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ చాలా జాగ్రత్తగా పరుగులు తీస్తాడు.అదే క్యాచ్ కోహ్లీ వైపు వెళ్తే అలవొక గా క్యాచ్లు పట్టేస్తాడు.క్యాచులు పట్టడంలో( Catches ) విరాట్ కోహ్లీ స్టైల్ అద్భుతంగా ఉంటుంది.

ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన సందర్భాలు చాలా అంటే చాలానే ఉన్నాయి.ఆ క్యాచులు పట్టే తీరును చూసి భారత ఫిల్డర్లే అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటారు.

వన్డే ఫార్మాట్లో క్యాచ్లు పట్టడంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ సృష్టించాడు.వన్డే ఫార్మాట్లో నాన్ వికెట్ కీపర్ గా అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాలుగవ స్థానంలో ఉన్నాడు.

Telugu Catches, Ind Wi Odi, Jayawardene, Ricky, Virat Kohli, Viratkohli-Sports N

ఈ జాబితాలో జయవర్ధనే 448 వన్డే మ్యాచ్లలో 218 క్యాచ్లు పట్టి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.రికీ పాంటింగ్ 375 మ్యాచ్లలో 160 క్యాచ్లు పట్టి రెండవ స్థానంలో, అజారుద్దిన్ 334 మ్యాచ్లలో 156 క్యాచ్లు పట్టి మూడవ స్థానంలో, టైలర్ 236 మ్యాచ్లలో 142 క్యాచ్లు పట్టి నాలుగో స్థానంలో ఉన్నారు.కోహ్లీ 275 మ్యాచ్లలో 142 క్యాచ్లు పట్టి టైలర్ తో సమానంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube