వన్డే వరల్డ్ కప్ లో సచిన్ రికార్డ్ లను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో పాత రికార్డులు బ్రేక్ అవుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.జట్ల ఆటగాళ్లు తమ జట్లను గెలిపించడంతోపాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Virat Kohli Breaks Sachin Tendulkar One Day World Cup Record Details, Virat Kohl-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి.భారత మాజీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్,( Sachin Tendulkar ) ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్( Ricky Ponting ) పేర్లపై ఉండే పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి.

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోను కొత్త రికార్డులు సృష్టించాడు.

గతంలో వన్డే క్రికెట్ చరిత్రలో వన్ డౌన్ స్థానంలో రికీ పాంటింగ్ 330 ఇన్నింగ్స్ ఆడి 12662 పరుగులు చేశాడు.

అయితే విరాట్ కోహ్లీ( Virat Kohli ) 215 ఇన్నింగ్స్ లలోనే 11 వేల పరుగుల మైలురాయిని చేరి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ 61 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడి 58 ఇన్నింగ్స్ లలో 2719 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

అయితే విరాట్ కోహ్లీ 64 ఇన్నింగ్స్ లలో 2780 పరుగులతో సచిన్ రికార్డును బ్రేక్ చేసేసాడు.

Telugu Anil Kumble, India Australia, Ricky, Rohit Sharma, Tendulkar, Tendulkar C

ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) 64 ఇన్నింగ్స్ లలో 2422 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను సరికొత్త రికార్డులు సృష్టించడంలో దిట్ట.అత్యధిక ప్రపంచ కప్ క్యాచులు పట్టిన భారత ఫిల్టర్ గా నిలిచాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకొని ఈ ఘనత సాధించాడు.

Telugu Anil Kumble, India Australia, Ricky, Rohit Sharma, Tendulkar, Tendulkar C

విరాట్ కోహ్లీ మొత్తం 15 క్యాచ్లతో అగ్రస్థానంలో నిలిచాడు.భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే( Anil Kumble ) 14 క్యాచ్ లతో రెండవ స్థానానికి పడిపోయాడు.కపిల్ దేవ్( Kapil Dev ) 12 క్యాచ్లు, సచిన్ టెండుల్కర్ 12 క్యాచ్లు, వీరేంద్ర సెహ్వాగ్ 11 క్యాచ్లు, మహమ్మద్ అజారుద్దీన్ 11 క్యాచ్లతో తర్వాతి స్థానాలలో నిలిచారు.

విరాట్ కోహ్లీ తన కెరియర్ లో మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటివరకు 305 క్యాచ్ లు పట్టాడు.మరో 30 క్యాచ్లు పడితే రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube