వైరల్ వీడియో: తన ఫ్రెండ్ బాధలో ఉన్నాడని చిన్నారి ఏం చేసాడంటే?

ప్రస్తుతం మానవ సంబంధాలన్ని మంటగలిసి పోతున్న రోజులివి.ఇక ఒకరి బాధలని ఇంకొకరు వినే ఓపిక అసలు ఉండడం లేదు.

 Viral Video: What Did The Child Do When His Friend Was In Pain ,giving Values T-TeluguStop.com

అందుకే మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు.మనం ఇంట్లో వారికి చెప్పుకోలేని బాధలని కూడా మనం మన స్నేహితుడికి చెప్పుకుంటాం.

అలాంటి స్నేహితులు దొరకడం అంటే అదృష్టవంతులమనే చెప్పాలి.ఎందుకంటే మన బెస్ట్ ఫ్రెండ్ తో చెప్పుకొని ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా హగ్ చేసుకుంటే కొంచెం బరువు తగ్గి ప్రశాంతంగా ఉంటాం.

ఇలా మనం చాలా సార్లు విన్నాం కదా.కాని ఇలా ఓ స్నేహితుడు ఏమైంది అని అడిగి ఒక హగ్ ఇచ్చి భరోసా ఇచ్చిన ఘటనలు సినిమాలలో తప్ప నిజంగా చూడలేదు కదా.

కాని అచ్చం ఇలాగే జరిగింది.తను స్నేహితుడు ఏదో బాధలో ఉన్నాడని పసి గట్టిన పిల్లాడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి ఆర్ యు ఒకే అని అడిగి నీకు హగ్ కావాలా అని అడిగి హగ్ ఇచ్చి తన స్నేహితుడిని ఓదార్చాడు.

ఈ సన్నివేశాన్ని అంతా ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి నెట్టింట్లో వదిలాడు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు బాధలో ఉన్నప్పుడు ఏవి మనల్ని బాధలో నుండి బయటపడేయలేవు.

మనస్ఫూర్తిగా హగ్ చేసుకొని మన స్నేహితుడు ఇచ్చే భరోసా తప్ప అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్ల హృదయాలను ఎంతగానో ఆకట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం.మీరూ ఓ లుక్కేయండి మరి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube