Viral Video: బాసు.. అది బస్సు కాదు.. రైలు.. అలా నెడుతున్నారేంటి..

భారతదేశంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్నప్పుడు ప్రజలు ఎన్నుకునే మొదటి ఆప్షన్ రైలు ప్రయాణం.అందుకు తగ్గట్టుగానే మన దేశంలో రైల్వే వ్యవస్థ( Railway system ) చాలా అభివృద్ధి చెందింది.

 Viral Video In Bihar Some Passangers Are Pussing Train-TeluguStop.com

పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలతో సహితం ఈ రైల్వే మార్గాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.అయితే వందే భారత్ రైళ్లు వంటి అత్యాధునిక రైలు వచ్చిన గాని ఇంకా అక్కడక్కడ రైల్వే వ్యవస్థలో కొన్ని లోపాలు కనబడుతూనే ఉంటాయి.

ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.

ఇకపోతే మామూలుగా రోడ్లపై బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులు ఒక్కోసారి స్టార్టింగ్ ట్రబుల్ తో ఇబ్బందులు పడుతుంటాయి.అప్పుడు బస్సు సిబ్బందితోపాటు ప్రయాణికులు కూడా బస్సును వెనుక నుండి నెడుతుంటారు.అచ్చం ఇలాంటి సంఘటన తాజాగా రైలుకు జరిగింది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బీహార్ లో జరిగిన రైలు ఘటనలో రైలులోని కొంత భాగం తగలబడిపోయింది.

కియుల్ స్టేషన్లోని పాట్నా-జాసిదిహ్ మెములో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.ఆగి ఉన్న రైలు ఒక్కసారిగా మంటలు చెలరేగగా చుట్టుపక్కల దట్టమైన పోగలు కమ్ముకున్నాయి.అయితే ఆ సమయంలో మిగతా భోగిలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ప్రయాణికులు రైలును నెడుతూ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రయాణికులు మంటలు వ్యాపించకుండా రైలు భోగిలను వేరు చేశారు.అయితే ఆ ప్రయాణికులు చేసిన సాహసం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.స్టేషన్ కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి వేశారు.ఇకపోతే ఈ రైలులో ప్రమాదం జరగడానికి గల కారణాలను ఇంకా అధికారులు అంచనా వేస్తున్నారు.

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube