వైరల్ వీడియో: లంక కెప్టెన్ పై కోచ్ మిక్కీ ఆగ్రహం..!

శ్రీలంక, ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఇండియా విజయం సాధించింది.

 Viral Video: Coach Mickey Angry Over Lankan Captain Viral Video, Social Media,-TeluguStop.com

అయితే రెండో మ్యాచ్ జరుగుతుండగా ఓ ఘటన చోటుచేసుకుంది.శ్రీలంక క్రికెట్ టీమ్ కోచ్ అయిన మిక్కీ ఆర్థర్ ఆ మ్యాచ్ మధ్యలో వ్యవహరించిన తీరు వెగటు పుట్టిస్తోంది.

ఆయన చేసిన పని విమర్శలకు తావిస్తోంది.భారత్‌తో కొలంబో వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శ్రీలంక టీమ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది.

అయితే కెప్టెన్ వ్యవహరించిన తీరుకు శ్రీలంక జట్టు ఓడిపోయింది.కెప్టెన్ చేసిన పనికి సహనం కోల్పోయిన మిక్కీ ఆర్థర్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ దసున్ షనకతో మైదానంలో వాగ్వాదానికి దిగాడు.

మ్యాచ్ చివర్లో ఫీల్డింగ్ విషయంలో కెప్టెన్, కోచ్ ఇద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ లో దూసుకుపోవడంతో అంతా తారుమారు అయ్యింది.

ఈ నేపథ్యంలో అదనంగా ఓ ఫీల్డర్‌ని మొహరించడంపై ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో మిక్కీ ఆర్థర్ చేసిన సూచనల్ని కెప్టెన్ షనక పాటించాడు.

అయితే థర్డ్ మ్యాన్ ప్లేస్‌లో కాకుండా ప్లై‌స్లిప్‌లో ఫీల్డర్‌ని పెట్టాడు.

దానివల్ల చివర్లో ఓ రెండు బౌండరీలు థర్డ్ మ్యాన్‌ ప్లేస్‌లో వెళ్లాయి.నిజానికి చెప్పాలంటే దసున్ షనకకి కెప్టెన్సీ అనుభవం అంతగా లేదు.

భారత్‌తో సిరీస్‌ కోసం అతని చేతికి కెప్టెన్ అవకాశం ఇచ్చారు.దీంతో ఫీల్డింగ్ మార్పు, బౌలింగ్ లో మార్పులో అనుభవం లేకుండా మ్యాచ్ ను ఆడారు.

మ్యాచ్ తర్వాత శ్రీలంక టీమ్ చేసిన తప్పులకు షనకతో కోచ్ మిక్కీ ఆర్థర్ గొడవకు దిగాడు.ఆయన వివరణ ఇస్తుండగానే ఆవేశంగా డ్రెస్సింగ్ రూముకు కెప్టెన్ వెళ్లిపోయాడు.దీంతో ఆర్ధర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇంకో వైపు చూస్తే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం చాలా కూల్ గానే కనిపించాడు.ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ జట్టు గెలుపులో భాగం అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube