మీకు మ్యాగీ ( Maggie )తయారు చేయడానికి ఎన్ని నిముషాలు పడుతుంది? 2 నిమిషాలు, మహాకాకపోతే ఓ మూడు నాలుగు నిముషాలు పండుతుంది.అంతకంటే ఎక్కువ సమయం పట్టదు.
అయితే దాన్ని మరింత రుచిగా వండటానికి ఇండియన్స్ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు.కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ ఆంటీ కేవలం 2 నిమిషాల్లో అయిపోయే మ్యాగీని కొత్తగా ప్రజెంట్ చేసింది.
అవును, సోషల్ మీడియా వచ్చిన తరువాత గల్లీల్లో వున్న క్రియేటర్ కూడా వెలుగులోకి వస్తున్నాడని చెప్పుకోవచ్చు.కాగా తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం కొంతమంది ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తోంటే.మరికొందరు ఆ వీడియోని విమర్శిస్తున్నారు.ఈ ప్రపంచంలో చాలామంది తినడానికే పుట్టినట్టు కనబడతారు.ఈ క్రమంలోనే ఓ ఫుడ్ బ్లాగర్ రుచికరమైన ఆహారం కోసం వెతుకుతూ ఓ ఆంటీని కలుసుకున్నాడు.రోడ్ సైడ్ బండి మీద స్నాక్స్ తయారు చేసి అమ్ముతున్న ఈ ఆంటీ కేవలం 2 నిమిషాలలో తయారయ్యే మ్యాగీతో కొత్త రుచిని పరిచయం చేసింది.
మొదట ఆ ఆంటీ ఉడికించిన మ్యాగీని ఒక హాట్ బాక్స్ లో పెట్టుకుని ఉంది.ఆంటీ మొదట రెండు బ్రెడ్ స్లైసులు ( Bread slices )తీసుకుని వాటి మధ్య మ్యాగీ నూడిల్స్ ( Maggi noodles )ఉంచింది.చూడ్డానికి శాండ్విచ్ లా కనిపించే దీన్ని త్రికోణాకారంలో కట్ చేయడం కొసమెరుపు.ఈ బ్రెడ్ ను ముందే తయారుచేసి ఉంచుకున్న శనగపిండిలో ముంచి వేడి నూనెలో వేయించింది.
ఇంకేముంది, కట్ చేస్తే రెండు నిముషాల్లోనే మ్యాగీ బ్రెడ్ పకోడాను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రీన్ చెట్నీతో సర్వ్ చేసింది.కాగా ఫుడ్ బ్లాగర్ ఆ పకోడా తిని మైమరచిపోయి ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.