వాము.మసాలా దినుసుల్లో ఇది ఒకటి.
ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే వాములో ఎన్నో పోషకాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఇది ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ఎన్నో జబ్బులను నివారిస్తుంది.ఈ నేపథ్యంలోనే వామును చాలా మంది రెగ్యులర్‌గా తీసుకుంటారు.
వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.పరగడుపున వాముతో టీ తయారు చేసుకుని తాగే వారు కూడా ఎందరో ఉన్నారు.
అయితే వాము ఆరోగ్యానికి మంచిదే.కానీ.
అతిగా తీసుకుంటే మాత్రం వివిధ రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.మరి ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొందరు గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయట పడేందుకు వామును తెగ వాడుతుంటారు.అయితే వామును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గడం కాదు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

అలాగే వాముకు శరీరంలోని వేడిని పెంచే గుణం ఉంది.అందువల్ల, దీనిని ఓవర్‌గా తీసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువై తలనొప్పి, డీహైడ్రేషన్, అలసట, బలహీనత, చెమటలు ఎక్కువగా పట్టడం, మైకం వంటి సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.గుండె పోటు వచ్చే రిస్క్ సైతం పెరుగుతుంది.అందుకే వామును చాలా అంటే చాలా లిమిట్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంతే కాదు, వామును ఓవర్‌గా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నోట్లో పుండ్లు, కడుపు అల్సర్ వంటి వాటనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది.వాము ఒక గర్భస్రావ కారకం.అందు వల్ల, ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలు వామును పూర్తిగా ఎవైడ్ చేయాలి.లేదంటే ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.