టీఆర్ఎస్ లో 'దుబ్బాక' అలజడి ? టెన్షన్ లో కేసీఆర్ ?

త్వరలో తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం తథ్యం అయిన నేపథ్యంలో, అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేసి, తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి.ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది.

 Kcr In Dubbaka By Election Tentsion Vijysanthi, Revanth Reddy, Kcr, Ktr, Trs, Ra-TeluguStop.com

ఇక టిఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రాలేదు.ఇక్కడ టిఆర్ఎస్ టికెట్ రామలింగారెడ్డి భార్యకు ఇవ్వాలా లేక కొడుకుకు ఇవ్వాలా అనే విషయంపై స్పష్టత రాలేదు.

ఫైనల్ గా ఆయన కుటుంబం నుంచి ఒకరు అభ్యర్థిగా నిలబడుతున్నారు.ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు తీవ్రమయ్యాయి.

దుబ్బాక నియోజక వర్గంలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో, కాంగ్రెస్ కు అక్కడ బలం ఉండడం ఇవన్నీ కలిసి వస్తాయని, టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో పెరిగిన కారణంగా ఇక్కడ కాంగ్రెస్ దే విజయం అని ఆ పార్టీ ధీమాలో ఉంది.

దీనికి తోడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇలా చాలామంది ప్రయత్నిస్తున్నారు.

అవినీతి ఆరోపణలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.ఇక బిజెపి తరఫున రఘునందన్ రావు అభ్యర్థిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈయన 2014 , 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

ఈసారి కూడా ఈయనకే బిజెపి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Dubbaka, Revanth Reddy, Trsramalinga, Vijysanthi-Telugu Political News

ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారు రంగంలోకి దిగి నియోజకవర్గం పై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా, నేతల హడావుడి మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది.అయితే ప్రతిపక్షాలు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ, టీఆర్ఎస్ ను అన్ని పార్టీలు టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తుండడం, ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నించడం, ఇవన్నీ కేసీఆర్ కు టెన్షన్ పెట్టిస్తున్నాయట.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందితే, ఆ ప్రభావం తర్వాత ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుందని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube