వారు గెలవకపోతే మీరు ఇంటికే ! కేసీఆర్ వార్నింగ్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్టుగా తెలంగాణాలో అన్ని పార్లమెంట్ స్థానాల్లో క్లిన్ స్వీప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.ఇలా జరిగితే మిగతా రాష్ట్రాల్లోనూ తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్నాడు.

 Kcr Warning To Minister-TeluguStop.com

అందుకే ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.దీనికి తగ్గట్టుగానే మరింత కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన మంత్రివర్గ సహచరులకు కూడా టార్గెట్ లు పెట్టి వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నాడు.మంత్రులు తమ పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అలా కానీ పక్షంలో మీ మంత్రి పదవులకు ఎసరు తప్పదని హెచ్చరికలు చేస్తున్నాడు.

16 నియోజకవర్గాల్లో ఏ మంత్రికి ఎక్కడ బాధ్యతలు అప్పగించారో అక్కడ విజయం దక్కకపోతే ఆ మంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్లను కాదని కొత్తగా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు కేసీఆర్.

సహజంగానే దీనిపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడి కి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు.ఇది కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది.మంత్రివర్గం పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు.

మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికలను వాడుకుంటున్నాడు.

దీంతో కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో కంగారు మొదలయ్యింది.ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత అనుకుంటున్నట్టుగా 16 స్థానాల్లో క్లిన్ స్వీప్ చేసే పరిస్థితి లేదని , ఇటువంటి సమయంలో గెలుపోటముల బాధ్యతలు మంత్రులపై ఉంచి ఎక్కడ ఎవరు విజయం సాధించకపోయినా మంత్రులను బాధ్యులను చేయాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ అని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.కేసీఆర్ మాత్రం లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించని చోట్ల మంత్రులను బాధ్యులను చేసి వారిని క్యాబినెట్ నుంచి తప్పిస్తానని ఖరాకండిగా చెప్పేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube