విజయ్ వారసుడు ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ!

కరోనా సమయంలో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగిపోవడంతో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇక థియేటర్లో విడుదలైన సినిమాలు కూడా కొన్ని వారాలలోనే ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

 Vijays Varasudu Is The Famous Company That Got The Ott Rights Vijay ,famous Com-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక సంక్రాంతి బరిలో పోటీకి దిగిన సినిమాలలో తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా ఒకటి.

Telugu Amazon Prime, Dil Raju, Company, Ott, Varasudu, Vijay-Movie

ఈ సినిమాలో హీరో విజయ్ సరసన రష్మిక నటించగా వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తమిళ భాషలలో నిర్మించారు.ఈ సినిమా మొదటినుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వస్తోంది అయితే విడుదల విషయంలో కూడా ఈ సినిమాని జనవరి 11వ తేదీ విడుదల చేస్తానని దిల్ రాజు ప్రకటించడంతో మరికొన్ని వివాదాలు ఎదురయ్యాయి.దీంతో చేసేదేమిలేక తమిళంలో పదకొండవ తేదీ విడుదల చేసినప్పటికీ తెలుగులో 14వ తేదీ ఈ సినిమా విడుదలైంది.

Telugu Amazon Prime, Dil Raju, Company, Ott, Varasudu, Vijay-Movie

ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి దూకుడుని కనబరిస్తోంది.ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గురించి పలు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube