సీఎం జగన్ పై దాడి కేసు.. బెజవాడ పోలీసుల కీలక ప్రకటన

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై దాడి కేసులో బెజవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు.సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుల వివరాలు చెబితే రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని బెజవాడ పోలీసులు ప్రకటించారు.సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్( Cellphone Video Recording ) లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అయితే 13వ తేదీన మేమంతా బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( MLA Vellampalli Srinivas ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Vijayawada Police About Attack On Cm Ys Jagan,cm Ys Jagan,vijayawada Police,atta-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube