ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే రాయచూర్ లోక్ సభ స్థానానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.
పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని రైతుబిడ్డ అయిన అరికెరె వెంకటేశ్ నాయక్ నాలుగుసార్లు లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు.మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న వెంకటేశ్ నాయక్ సాధించిన రికార్డ్ అక్కడ ఇప్పటివరకు బ్రేక్ కాలేదు.
వెంకటేశ్( Venkatesh naik ) 1991 సంవత్సరంలో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా తొలి ప్రయత్నంలోనే విజయం దక్కింది.1998, 1999, 2004 సంవత్సరాలలో వరుసగా ఎంపీగా విజయాలను అందుకున్నారు.2009 సంవత్సరంలో పార్టీ టికెట్ నిరాకరించడంతో వెంకటేశ్ నాయక్ ఎన్నికల్లో పోటీ చేయలేదు.2013 సంవత్సరంలో విధానసభ ఎన్నికల్లో దేవదుర్గ నుంచి పోటీ చేసిన వెంకటేశ్ ఆ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.
అయితే ఎమ్మెల్యే అయిన కొన్నిరోజులకే ఆయన మృతి చెందారు.2014 సంవత్సరంలో వెంకటేశ్ పెద్ద కుమారుడు బి.వి.నాయక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించగా 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.ఈ ఎన్నికల్లో బి.వి.నాయక్ బీజేపీ నుంచి టికెట్ ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు.తర్వాత రోజుల్లో వెంకటేశ్ నాయక్ కుటుంబ సభ్యులు దేవదుర్గ ( Devadurga )నుంచి పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.
వెంకటేశ్ నాయక్ చిన్న కొడుకు రాజశేఖర్ నాయక్, కోడలు శ్రీదేవి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు.వెంకటేశ్ నాయక్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణ రైతు బిడ్డ 4 సార్లు ఎంపీగా గెలవడం సులువు కాకపోయినా వెంకటేశ్ నాయక్ మాత్రం ఎంతో కష్టపడి పొలిటికల్ కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.వెంకటేశ్ మరణించి చాలా సంవత్సరాలు అయినా ఆయన గురించి రాయచూర్ లో గొప్పగా చెప్పుకుంటారు.