స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.తమిళంలో ధనుష్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్టైన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
వెంకటేష్ కు జోడీగా ప్రియమణి ఈ సినిమాలో నటిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీకాంత్ అడ్డాల గత సినిమాలు ముకుంద, బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అయితే గత కొన్ని రోజుల నుంచి నారప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బెటర్ ఔట్ పుట్ కోసం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉండటం గమనార్హం.అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్నారు.వెంకటేష్ నటిస్తున్న రీమేక్ సినిమాలు మిశ్రమ ఫలితాలను అందుకుంటున్నాయి.కులాలు, భూ వివాదాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా హిట్ అయితేనే శ్రీకాంత్ అడ్డాల మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.
శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెరకెక్కి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాను సురేష్ బబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.