లావణ్య త్రిపాఠి రిసెప్షన్ చీర ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. అంత ఖర్చు చేశారా?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ( Varun Tej Lavanya Tripathi Reception )వేడుక ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది.లావణ్య త్రిపాఠి పెళ్లి చీర చాలా బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ పెళ్లి చీర ఖరీదు ఏకంగా 2.75 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.రిసెప్షన్ వేడుకకు సినిమా రంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు.ప్రముఖ డిజైనర్లలో ఒకరైన మనీష్ మల్హోత్రా ఈ చీరను డిజైన్ చేశారని భోగట్టా.లావణ్య త్రిపాఠి ధరించిన బంగారు వర్ణం చీర ఆమెకు బాగా సూట్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ లావణ్య జోడీ సూపర్ జోడీ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Varun Tej Lavanya Tripathi Saree Price Details Here Goes Viral In Social Media-TeluguStop.com

లావణ్య పెళ్లి డ్రెస్ కు స్పాన్సర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఒక పెద్ద సంస్థ డిజైన్ చేయించిన దుస్తులను లావణ్యకు ఇచ్చి ఆ ఫోటోలను పబ్లిసిటీకి వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

Telugu Naga Babu, Tollywood, Varun Tej, Varuntej-Movie

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.వరుణ్, లావణ్య నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఈ జోడీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.వరుణ్ తేజ్, లావణ్య కలిసి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించాలని మరి కొందరు చెబుతున్నారు.పెళ్లికి ముందు సరైన హిట్లు లేని వరుణ్ తేజ్ కు పెళ్లి( Varun Tej Marriage ) తర్వాత భారీ విజయాలు దక్కుతాయేమో చూడాలి.

Telugu Naga Babu, Tollywood, Varun Tej, Varuntej-Movie

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ( Varun tej lavanya tripathi )కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.వరుణ్ తేజ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుణ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.కెరీర్ విషయంలో వరుణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube