బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ( Varun Dhavan ) అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈయన మన సౌత్ హీరోయిన్లతో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు.
అలా ఇప్పటికే సమంత( Samantha ) , కీర్తి సురేష్ వంటి వాళ్ళు ఈయనతో కలిసి నటించబోతున్నారు.అయితే అలాంటి వరుణ్ దావన్ ఓ హీరోయిన్ చెల్లెల్ని సీక్రెట్ గా వెంబడించారట.
మరి ఆయన ఎందుకలా వెంబడించారు.ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలు ఎవరు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ లో దర్శకుడిగా.నిర్మాతగా.
కొనసాగుతున్న కరణ్ జోహార్ అందరికీ తెలిసే ఉంటారు.ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా నిర్మాతగా చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఆ మధ్యకాలంలో వచ్చిన లైగర్ సినిమాని హిందీలో ప్రొడ్యూస్ చేశారు.
అయితే అలాంటి కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్( Cofee with karan ) అనే షో కి హోస్ట్ గా చేసే సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ షోకి వెళ్లిన వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టడంలో కరెంట్ జోహార్ దిట్ట.అంతేకాదు ఇప్పటివరకు సమంత ఎక్కడా కూడా తన పెళ్లి విడాకుల గురించి స్పందించలేదు.కానీ మొదటిసారి ఈ షోలో స్పందించింది.
అలాగే సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్స్ ని కూడా బట్టబయలు చేస్తారు.అయితే ఈ షో కి తాజాగా బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హాజరయ్యారు.

ఇక ఈ షోలో కియారా అద్వానితో ప్రేమ, పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని సిద్ధార్థ్ మల్హోత్ర ( Siddharth malhotra ) చెప్పుకొచ్చారు.అలాగే వరుణ్ ధావన్ ఇంస్టాగ్రామ్ లో ఏ హీరోయిన్ చెల్లిని స్టాకింగ్ చేశాడు అనే సంగతి కూడా బయట పెట్టారు.వరుణ్ ధావన్ మాట్లాడుతూ.నేను అయేషా శర్మను రహస్యంగా వెంబడించాను.ఎందుకంటే నేను ఆమె ఫిట్నెస్ కి ఆకర్షితుడినయ్యాను.అందుకే ఆమెను రహస్యంగా వెంబడించాను అంటూ వరుణ్ దావన్ చెప్పుకొచ్చారు.

ఇక ఆయేషా శర్మ ఎవరో కాదు రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమా లో హీరోయిన్ గా చేసిన నేహా శర్మ ( Neha sharma ) చెల్లెలు.ఇక వరుణ్ ధావన్ ఈ విషయం బయట పెట్టడంతో అయేషా శర్మ ( Ayesha sharma ) కి ఈ విషయం తెలియడంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రిప్లై ఇచ్చింది.ఆమె మాట్లాడుతూ.మీరు కాఫీ విత్ కరణ్ షోలో నా పేరు రెండుసార్లు తీసినందుకు ధన్యవాదాలు.అసలు మీరు నన్ను స్టాకింగ్ చేస్తున్న సంగతి నాకు తెలియదు.అంటూ లాఫింగ్ ఏమోజీస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.