ఇప్పుడు ఏం మాట్లాడిన కరోనా వైరస్ ఏ.ఏం తలుచుకున్న కరోనానే.
ఏం చెయ్యాలి అన్న కరోనా వైరస్ గురించి ఆలోచించాల్సిందే.అలా అయ్యింది జీవితం .ఇంకా అలాంటి ఈ సమయం పెళ్లి చేసుకునే వారికీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది.అయినా సరే కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఒకప్పుడు పెళ్లి అంటే ఓ రేంజ్ లో చెయ్యాలి అని.అందరూ గొప్ప గొప్పగా చెప్పుకోవాలి అనుకునే జనాలు అంత కూడా ఇప్పుడు గుట్టు చెప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.కొందరు ఈ కరోనా సమయంలో ఆదర్శంగా ఉండేందుకు మాస్కులు వేసుకొని పెళ్లిళ్లు చేసుకుంటుంటే.మరికొందరు సోషల్ డిస్టెన్స్ అని దూరంగా నుండి పెళ్లి చేసుకుంటున్నారు.
ఇంకా సినిమా వాళ్ళు.రాజకీయ నాయకులూ అయితే ఇప్పటికి జనాలు తక్కువ ఉన్నప్పటికి అంగరంగ వైభవంగానే చేసుకుంటున్నారు.
మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినప్పటికీ జనాలు తక్కువగానే ఉంటున్నారు.అలానే మన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి చేసుకున్నాడు, హీరో నిఖిల్ అలానే, నటుడు మహేష్ అలానే పెళ్లి చేసుకున్నారు.
ఇంకా ఇలా అందరు పెళ్లిళ్లు అయితే చేసుకుంటున్నారు.ఇంకా అలానే ఇప్పుడు వరుడు ఒక ఊరిలో.వధువు ఒక ఊరిలో ఉండి పెళ్లి చేసుకున్నారు.అదెలా అనుకుంటున్నారా? కేరళకు చెందిన విగ్నేష్, అంజలి లాక్ డౌన్ వేళ వెరైటీగా పెళ్లి చేసుకున్నారు.పుణేలో ఉద్యోగం చేసే వీరిద్దరి పెళ్లిని పెద్దలు నిశ్చయించగా లాక్ డౌన్ వల్ల కేరళకు వెళ్లలేకపోయారు.దీంతో జూమ్ కాల్ ద్వారా 100 మంది అతిధులను ఆహ్వానించి.
విగ్నేష్ ప్లాట్ లో పెళ్లి చేసుకున్నారు.అటు స్పీడ్ పోస్టు ద్వారా అమ్మాయి తల్లి తండ్రులు మంగళసూత్రాన్ని పంపడంతో పాటు జూమ్ కాల్ ద్వారా ఆశీర్వచనాలు అందించారు.