Free Meals Via ChatGPT : చాట్‌జీపీటీ సాయంతో ఉచితంగా ఆహారం పొందుతున్న వ్యక్తి.. అదెలా?

ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ( ChatGPT ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇది ఎలాంటి ప్రశ్నకైనా సెకన్ల సమయంలోనే కచ్చితమైన సమాధానాలను అందిస్తుంది.

 Us Man Explains How He Gets Free Meals From Mcdonalds Using Chatgpt-TeluguStop.com

అంతేకాదు అనేక సమస్యలకు ఇది చిటికెలో సొల్యూషన్ అందిస్తుంది.వివిధ రకాల అంశాలలో డబ్బులను సేవ్ చేసుకునే ఉపాయాలను కూడా అందిస్తుంది.

ఇటీవల గేజ్( Gage ) అనే యువ వ్యాపారవేత్త మెక్‌డొనాల్డ్స్ నుంచి ఫ్రీగా ఫుడ్ పొందడానికి చాట్‌జీపీటీని ఉపయోగించే ఓ మార్గాన్ని కనుగొన్నాడు.అదేంటంటే, ఈ వ్యాపారవేత్త మెక్‌డొనాల్డ్ మెషీన్‌( McDonald Machine )ల నుంచి రసీదులు తీసుకుంటాడు, ఆన్‌లైన్‌లో ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌ను పూరించడానికి ఆ రసీదుల కోడ్స్‌ను ఉపయోగిస్తాడు.

మెక్‌డొనాల్డ్ సర్వీస్ లేదా ఫుడ్ గురించి బ్యాడ్ లేదా నెగటివ్ రివ్యూలు( Negative Reviews ) రాయడానికి చాట్‌జీపీటీని ఉపయోగిస్తాడు.అప్పుడు క్షమించమని అడుగుతూ మెక్‌డొనాల్డ్స్ ఓ ఫ్రీ ఫుడ్ వోచర్‌ అందజేస్తుంది.గేజ్ ‘ఆల్ థింగ్స్ అమెజాన్'( All Things Amazon ) అనే పోడ్‌కాస్ట్‌లో దీని గురించి మాట్లాడాడు.తొమ్మిది నెలల్లో 100కు పైగా ఉచిత వోచర్లు తాను అందుకున్నానని చెప్పాడు.

ఖాళీగా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతానని, తన ట్రిక్స్‌తో ఎవరినీ బాధించడం లేదని చెప్పాడు.అయితే బాగా తెలిసిన చోట ఇలాంటి రసీదులు పొందడం కష్టతరం అవుతుందని అతడు వెల్లడించాడు.

అయితే గేజ్ చేస్తున్న పని చాలా మందికి నచ్చలేదు.మెక్‌డొనాల్డ్స్ కార్మికులను ఈ యువకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అతని నకిలీ బ్యాడ్ రివ్యూలు( Fake Negative Reviews ) వల్ల కార్మికుల ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తాయని లేదా డబ్బును కోల్పోయేలా చేయగలవని నెటిజన్లు ఫైర్ అయ్యారు.టెక్నాలజీని కంపెనీలను మోసం చేయడానికి వాడుకోవడం బాధాకరమని మరి కొంతమంది అన్నారు.

ఇతడికి శిక్ష పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube