పవన్ కళ్యాణ్‌తో ‘భద్రి’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్ ఆ సమయంలోనే పవన్‌తో ప్రేమలో పడటం జరిగింది.‘భద్రి’ తర్వాత వీరిద్దరి ప్రేమ సహజీవనం వైపుకు సాగింది.
దాదాపు పది సంవత్సరాల పాటు సహజీవనం సాగించిన వీరిద్దరు ఒక బాబుకు కూడా జన్మనిచ్చిన విషయం తెల్సిందే.రాజకీయ అవసరాల కోసం రేణుదేశాయ్‌ను పవన్ అప్పట్లో పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత కూడా వీరిద్దరి జీవితం కొన్నాళ్ల పాటు హాయిగా గడిచిపోయింది.కాని మద్యలో ఏమైందో కాని వీరిద్దరి సంసార జీవితంలో పొరపొచ్చాలు వచ్చాయి.
దాంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత పూణెలో ఉంటున్న రేణుదేశాయ్ తాజాగా వివాహంకు సిద్ద అయ్యింది.

పవన్ నుండి విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్ ఆయన్ను అభిమానించింది.పవన్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వచ్చింది.పిల్లల కోసం వీరు పలు సందర్బాల్లో కలిశారు.అయితే తాజాగా రేణుదేశాయ్ రెండవ వివాహంకు సిద్దం అయ్యింది.దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రేణుదేశాయ్ చెబుతుంది.రేణుదేశాయ్‌కు ఆప్తుడు, మిత్రుడు అయిన ఒక వ్యక్తి ఈమె గురించి పూర్తిగా తెలిసి కూడా వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.
మంచి వ్యక్తి అవ్వడంతో పాటు, తన జీవితాన్ని అర్థం చేసుకుంటాడనే ఉద్దేశ్యంతో ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు రేణుదేశాయ్ సిద్దం అయ్యింది.
ఇటీవలే నిశ్చితార్థం కూడా అయినప్పటికి ఇప్పటి వరకు రేణుదేశాయ్ తనకు కాబోయే భర్త గురించిన విషయాలను అధికారికంగా వెళ్లడి చేయలేదు.
అతడి ఫేస్‌ను కూడా పూర్తిగా విడుదల చేయలేదు.సోషల్ మీడియాలో తాజాగా రేణుదేశాయ్ పోస్ట్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.దాంతో రేణుదేశాయ్‌ని వివాహం చేసుకోబోతున్న భర్త ఏం చేస్తున్నాడు, ఎలా వీరిద్దరికి పరిచయం అయ్యింది అంటూ సెర్చ్ చేస్తున్నారు.
వీరిద్దరిది ఇప్పటి స్నేహం కాదని, చాలా కాలంగా వీరిద్దరి మద్య స్నేహం ఉందని, వ్యాపారవేత్త అయిన ఆ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితమే రేణుదేశాయ్‌ని వివాహం చేసుకుంటాను అంటూ అడిగాడట.
ఆ సమయంలో ఆలోచించలేక పోయిన రేణు తాజాగా తన భవిష్యత్తుకు ఖచ్చితంగా మగ తోడు అవసరం అని భావించింది.అందుకే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.రేణుదేశాయ్ రెండవ పెళ్లి విషయంలో పవన్‌తో కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.