తుమ్మల నాగేశ్వరరావు ఈపేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా పేరు చెప్తే తుమ్మల గుర్తుకు వచ్చేవారు.
బాబు కి ఎంతో వీర విధేయుడిగా ఉండే తుమ్మల.విభజన తరువాత పార్టీ మారి టీఆర్ఎస్ లోకి వెళ్ళాల్సిన వచ్చింది.
దాంతో అప్పటి నుంచీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా మారారు.
మొన్నటికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తుమ్మల ప్రత్యర్ధి చేతిలో ఓడిపోవడంతో, తుమ్మల రాజకీయ భవిష్యత్తుకి ఇక తెర పడినట్టే అని భావించారు అందరూ.
కాని ఈ సమయంలో కేసీఆర్ తుమ్మల విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తుమ్మల లాంటి మంచి నాయకత్వం కలిగి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నేత ఓడినా సరే ఆ పరిస్థితిలు తనకి తెలుసుకునని అందుకే తుమ్మలకి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

అధికారులతో పనులు చేయించడం కాని , సబ్జక్ట్ పరంగా మాట్లాడే సామర్ధ్యం, గతంలో టీడీపీ లో ఇద్దరూ కలిసి పని చేయడం, ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఏకాభిప్రాయంతో కేసీఆర్ మళ్ళీ తుమ్మలని మంత్రి పదవిలోకి తీసుకోవడానికి దోహదపడుతున్నాయట.ఇదిలాఉంటే తుమ్మల ఓడిపోవడానికి పావులు కదిపిన వారికి బుద్ది చెప్పడం కోసం కూడా తుమ్మలకి ఓడినా సరే మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్.

ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రాతినిధ్యం కోరుతోందని, తుమ్మలతోనే అది సాధ్యం అవుతుందని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారట.అంతేకాదు తుమ్మలకి ఈ సారి ఇవ్వబోయే మంత్రి పదవుల్లో గతంలో కేసీఆర్ ఇచ్చిన రోడ్లు భవనాల శాఖనే మళ్ళీ అప్పగించనున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేసే తుమ్మల ఓడినా సరే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని అనుకోవడం మంచి పరిణామం అంటున్నారు ఖమ్మ్మం ప్రజలు.
అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు పరిశీలకులు.