దేశీయ ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్స్ తయారీ కంపెనీ ట్రూఫ్లో బై హింద్వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంస్థ సువిశాల కర్మాగారం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది.
ఇప్పటివరకు పైపులు, ఫిట్టింగ్స్ తయారు చేస్తూ ప్రజల అవసరాలను తీర్చిన ఈ సంస్థ ఇప్పుడు పీటీఎంటీ ఫౌసెట్స్, ఫ్లష్ ట్యాంకులు, సీట్ కవరింగ్స్, ఇతర యాక్ససరీలతో కూడిన బాత్ ఫిట్టింగ్స్ తయారు చేయడం మొదలు పెట్టింది.ట్రూఫ్లో కంపెనీ ప్రస్తుతం పీటీఎంటీ ఫౌసెట్స్ కోసం 14 డిజైన్ వేరియంట్లను, 6 ఫ్లష్ ట్యాంక్ వేరియంట్లను అందుబాటులోకి తెస్తోంది.
తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఫౌసెట్స్ డిజైన్ను ఎంపిక చేసుకోవడం వీలవుతుంది.
ఈ బాత్ ఫిట్టింగ్స్ను 100 % ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేస్తుండటం విశేషం.వీటిలో ఇంజనీర్డ్ ధర్మోప్లాస్టిక్ పాలిమర్, సిల్వర్ అయాన్ నానో టెక్నాలజీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ వంటి ఎన్నో టెక్నాలజీలు యాడ్ చేయడం వల్ల వినియోగదారులు అనారోగ్యాలకు గురికారు.అలానే ఆ పీటీఎంటీ ఫౌసెట్స్ ఎక్కువకాలం మన్నుతాయని కంపెనీ చెబుతోంది.
కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం, ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వడం, నిర్మాణాలు ఎక్కువ కావడం వంటి కారణాలవల్ల పీటీఎంటీ మెటీరియల్స్ తయారు చేసే కంపెనీల సంఖ్య పెరగవచ్చని నిపుణులు అంటున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ కంపెనీ వీటిని తయారు చేసే జాబితాలో చేరిపోయింది.
ఇదిలా ఉండగా ట్రూఫ్లో హైదరాబాద్లోని ఇస్నాపూర్లో ఉన్న తమ రెండో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కమర్షియల్ ప్రొడక్షన్ను ప్రారంభించింది.ఇక్కడ ఒక సంవత్సరానికి 30వేల టన్నుల నుంచి 48 వేల టన్నుల ప్రొడక్ట్స్ తయారు చేయనుంది.ఇకపోతే ఈ కంపెనీ రీసెంట్ గా రిలయన్స్ వరల్డ్వైడ్ కార్పోరేషన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.ఈ ఒప్పందం సహాయంతో షార్క్ బైట్ మల్టీ లేయర్ కంపోజిట్ పైప్ ప్లంబింగ్ సొల్యూషన్ను మార్కెటింగ్ చేయనుంది.
ప్రీమియం హౌసింగ్, ప్రాజెక్ట్ వస్తువులను కూడా తయారు చేయనుంది.