ప్రజలను తప్పుదారి పట్టించే యాడ్స్పై భారత ప్రభుత్వం కదం తొక్కడానికి రెడీ అయింది.ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం సరికొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.
ఈ నిబంధనలను పాటించని పక్షంలో ఇన్ఫ్లుయెన్సర్లపై భారీగా ఫైన్ విధిస్తామని ప్రకటించింది.అంతేకాదు మూడేళ్లపాటు వారిపై బ్యాన్ విధిస్తామని తెలిపింది.
సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ ఈ నిబంధనలను జారీ చేయడంతో పాటు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్పై చర్యలు తీసుకుంటోంది.

సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను ‘ఎండార్స్మెంట్ నో-హౌస్’ పేరిట తీసుకొచ్చింది.యూజర్లను తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత ప్రకటనల నుంచి రక్షించడానికి, స్పాన్సర్డ్ కంటెంట్ను, బ్రాండ్లతో కొలాబరేషన్ను మరింత స్పష్టంగా బహిర్గతం చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లపై ఈ నిబంధనలను ప్రభుత్వం పెట్టింది.అలానే ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇన్ఫ్లుయెన్సర్లు తాము అందుకునే గిఫ్ట్, ఉండే హోటల్ అకామిడేషన్, డిస్కౌంట్స్, అవార్డ్లు, ఎండార్సింగ్ ప్రొడక్ట్స్, సర్వీస్-స్కీమ్ వంటి అంశాల్లో వ్యవహరించాలి.
వారు ఈ అన్ని అంశాల వెనుక ఉన్న వివరాలను బహిర్గతం చేయాలి.అలా కాదని ప్రవర్తిస్తే వినియోగదారుల రక్షణ చట్టం-2019 కింద మిస్లీడింగ్ యాడ్స్ చేశారనే అభియోగంతో ఫైన్ విధిస్తారు.

ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా ఉత్పత్తులను ఎండార్స్ చేసేటప్పుడు దాని గురించి అన్ని వివరాలను చాలా క్లియర్గా, అందరికీ అర్థమయ్యే భాషలో వెల్లడిస్తే ప్రజలు మోసపోయే అవకాశాలు తగ్గుతాయి.అందుకే అందరూ ఇలా చేయాలంటూ ప్రభుత్వం రూల్స్ తెచ్చింది.ఇక ఈ రూల్స్ బ్రేక్ చేస్తే సాధారణంగా ఫైన్ అనేది రూ.50 లక్షల వరకు ఉంటుంది.బ్యాన్ కాలం మూడేళ్లు.ప్రకటనదారులు, ఎండార్సర్లపై రూ.10 లక్షల ఫైన్.ఈ నిబంధనలను వినియోగదారుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇదిలా ఉండగా 2022లో ఇండియన్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ వాల్యూ రూ.1,275 కోట్లు ఉంది.ఆ వాల్యూ 2025 నాటికి 19-20 వృద్ధి రేటుతో రూ.2,800 కోట్లకు పెరగవచ్చు.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు.







