ఒత్తిడిలో మునిగిపోతున్న స్టార్ డైరెక్టర్స్.. కారణం?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరికీ కూడా ఒత్తిడి పెరిగి పోతుందా అంటే అవును అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది.ఎందుకంటే ప్రస్తుతం సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.

 Tollywood Directors Are Under Pressure Koratala Sukumar Prasanth Neel Details, T-TeluguStop.com

కేవలం ఒక భాషకు సంబంధించిన ప్రేక్షకులకు మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది.అంతేకాదు ఒక దర్శకుడు హిట్ కొట్టాడు అంటే అంతకు మించి సినిమా ఎలా తియ్యాలి అనే ఆలోచన చేయాల్సి ఉంటుంది.

ఇక ఇలాంటి ఆలోచనల మధ్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా ఒత్తిడిలో మునిగిపోతున్నారు అన్నది తెలుస్తుంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కే జి ఎఫ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ కి ఈ సినిమా విజయం పీక మీద కత్తి లా మారిపోయింది.ఎందుకంటే ఇక ఇప్పుడు అతని దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా అంతకుమించి అనే రేంజ్ లోనే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.

దర్శకుడితో చేసే హీరోలు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు అందరూ కూడా భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.అంతేకాదు ఒకప్పుడు వివిధ లొకేషన్లలో షూటింగ్ జరిగేది.

కానీ ఇప్పుడు మాత్రం గ్రీన్ మ్యాట్ లో షూటింగ్ చేయడం ఇక విఎఫ్ఎక్స్ కి ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తున్నారు.

కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు అటు మ్యూజిక్ డైరెక్టర్స్ పై కూడా ఇలాంటి ఒత్తిడి ఉంది అని తెలుస్తూ ఉంది.

Telugu Prasanth Neel, Shanker, Sukumar, Kgf, Koratala Shiva, Panindia, Puri Jaga

ఎందుకంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నప్పుడే అటు సినిమాలు హిట్ అవుతున్నాయి.దీంతో ఇక సినిమా హిట్ అయిందంటే అంతకుమించి తర్వాత సినిమాలు ఎలా చేయాలని మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అనుకుంటున్నారు.ఇకపోతే పుష్ప 1 బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్ సైతం ఇక ఇప్పుడు పుష్ప 2 విషయంలో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఎలా అని పక్క ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆచార్య తో ఫ్లాప్ చవిచూసిన కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తో సినిమా రూపంలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక కొరటాలకు తన టేకింగ్ కీ ఎన్టీఆర్ సినిమా సవాల్ లాంటిదే అని చెప్పాలి.

Telugu Prasanth Neel, Shanker, Sukumar, Kgf, Koratala Shiva, Panindia, Puri Jaga

ఇక ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై కూడా అదే రేంజిలో అంచనాలు ఉన్నాయి.వీటితోపాటు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా ఎలా ఉండబోతుందో ఎదురు చూస్తున్నారు.ఇక ఆచార్యతో చిరంజీవికి ఫ్లాప్ రావడంతో ఇక తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో అని చిరు తో చేస్తున్న దర్శకుడు ఒత్తిడి పెరిగిపోయింది.

ఇలా ఒక్కరేమిటిఅందరూ స్టార్ దర్శకులు కూడా ఒత్తిడిలో మునిగిపోతున్నారు అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube