దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా రంగ ప్రవేశం చేసి 13 ఏళ్లు పూర్తి అయ్యింది.అయితే ఇప్పటి వరకు ఆయన నుండి వచ్చిన సినిమాలు కేవలం అయిదు మాత్రమే.
సక్సెస్ లు లేక పోవడం వల్ల సినిమాలు చేయడం లేదా అంటే అదేం కాదు.ఆయన తెరకెక్కించిన అయిదు సినిమాల్లో దాదాపు అన్ని కూడా హిట్ సూపర్ హిట్ గా నిలిచాయి.
అయినా కూడా ఆయన మాత్రం సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి చేయడం లేదు.ఒక సినిమా మరో సినిమాకు మద్య ఏకంగా ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు.
హడావుడిగా చేసి ప్లాప్ లు చవి చూడటం ఆయనకు ఇష్టం లేనట్లుంది.అందుకే రెండు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా అన్నట్లుగా చేస్తున్నాడు.
ఇప్పుడు వంశీ కొత్త సినిమా ఏమీ చేయడం లేదు.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం మహర్షి సినిమాతో వంశీ వచ్చాడు.తదుపరి సినిమాను కూడా మహేష్ తో చేయాలని వెయిట్ చేస్తున్నాడు.సినిమాలు చేయనంత మాత్రాన ఈయనేం ఖాళీగా లేడు.
సంపాదన లేదని కాదు.ఈయన నెలకు 15 నుండి 25 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆహా ఓటీటీ కోసం కథలను ఎంపిక చేయడం.కాన్సెప్ట్ లను చూడటం వంటి బాధ్యతలను ఈయనకు అల్లు అరవింద్ అప్పగించాడు.
ఇదే కాకుండా మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ ఇతర ఆయన బిజినెస్ లు కూడా వంశీ చూసుకుంటున్నాడు.ఇక ఇతర దర్శకులు కూడా వంశీని సిట్టింగ్స్ కోసం పిలుస్తూ ఉంటారు.అలా కూడా ఆయనకు అమౌంట్ అందుతూ ఉంది.మొత్తానికి సినిమాలు చేయకుండానే ఫుల్ బిజీగా వంశీ ఉన్నాడు.ఇదే సమయంలో ఆయన సంపాదన కూడా భారీగా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.