తోటి ప్యాసింజర్‌ను బిస్కెట్లు అడిగిన చిన్నారి.. బదులుగా ఏమిచ్చిందో చూస్తే నవ్వాగదు..

చిన్నపిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు.వారు చేసే చేష్టలు కూడా ముచ్చట గొలిపిస్తుంటాయి.

 Toddler Exchanges Baby Juice In Return To Biscuits With Passenger Details, Viral-TeluguStop.com

వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకుంటాయి.తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో సుమారు ఐదేళ్ల వయసు ఉన్న ఒక బాలిక తన వెనుక కూర్చున్న ప్యాసింజర్( Passenger ) నుంచి క్యాండీ స్వీట్ ఐటమ్ అడిగి తీసుకుంది.అది ఇచ్చినందుకు బదులుగా తన బేబీ జ్యూస్( Baby Juice ) ప్యాసింజర్ కి ఇచ్చింది.

ఈ వీడియో చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి బస్సు ట్రైన్ సీట్లో కూర్చొని ఉండటం మనం చూడవచ్చు.ఆ చిన్నారి వెనక ఉన్న సీట్‌లో మరొక ప్యాసింజర్‌ ఉన్నారు.ఆ ప్యాసింజర్‌ వైపే బాలిక ( Girl ) చూస్తుండడం గమనించవచ్చు.

ఆ ప్యాసింజర్ దగ్గర టేస్టీ బిస్కెట్స్( Biscuits ) ఉన్నాయి.వాటి కోసమే బాలిక ప్యాసింజర్ వైపు చూసింది.

చాలా క్యూట్ గా చూస్తూ ఉంటే కాదనలేక ప్యాసింజర్ బాలికకు ఒక బిస్కెట్ ఇచ్చింది.దానిని సంతోషంగా బాలిక తీసేసుకుంది.

కొన్ని సెకన్ల తర్వాత తాను తాగే బేబీ జ్యూస్ లేదా మిల్క్ ప్యాసింజర్‌కి ఇచ్చింది.ఫుడ్ ఎక్స్ఛేంజ్( Food Exchange ) చేసుకుందామన్నట్లు ఆ బాలిక ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది.కాటన్ క్యాండీ బిస్కెట్ అడుగుతున్నప్పుడు చిన్నారి ముఖంపై కనిపించిన చిరునవ్వును చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.బాలిక అడగగానే బిస్కెట్ ఇచ్చిన ప్యాసింజర్ ని కూడా పొగుడుతున్నారు.

@TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 68 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube