ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు ( AP Elections ) రాబోతున్నాయి.దీంతో 2024 ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.
టీడీపీ.జనసేన పార్టీలు కలసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) సింగిల్ గా పోటీ చేయబోతోంది.ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తూ కొత్తవారిని నియమిస్తున్నారు.ఈ రకంగా 11 నియోజకవర్గాలకు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమించడం జరిగింది.
అంతేకాకుండా కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ రకంగానే కాకినాడ ఎంపీ వంగా గీతని( MP Vanga Geetha ) 2024 ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ ప్రచారంపై తాజాగా ఎంపీ వంగా గీత స్పందించారు.ఎమ్మెల్యేగా పోటీ విషయంలో నాకు ఇప్పటివరకు పార్టీ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు.వచ్చే ఎన్నికలలో అధిష్టానం నిర్ణయమే నాకు ఫైనల్.ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలోకి దిగుతా.
ఎన్నికల సమయంలో రకరకాల మార్పులు ఉండటం అన్ని పార్టీలలోను సహజమని వంగా గీత తెలియజేయడం జరిగింది.