నేడు పాక్-శ్రీలంక మధ్య మ్యాచ్.. గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో ఢీ..!

ఆసియా కప్( Asia Cup ) టోర్నీలో సూపర్-4 దశలో భాగంగా నేడు పాకిస్తాన్- శ్రీలంక( Pakistan-Sri Lanka ) మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.

 Today's Match Between Pak-sri Lanka The Winning Team Will Face India In The Fina-TeluguStop.com

కాబట్టి నేడు జరిగే మ్యాచ్ పాకిస్తాన్-శ్రీలంక జట్లకు ఎంతో కీలకం.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్ లో విజేతగా నిలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని రెండు జట్లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.అయితే నేడు జరిగే మ్యాచ్ కు వర్ష గండం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.మరి వర్షం కారణంగా నేడు జరిగే మ్యాచ్ రద్దు అయితే సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ తో ఏ జట్టు తలపడుతోంది అనే దానిపై అభిమానులలో చర్చ నడుస్తోంది.వర్షం కారణంగా ఈరోజు జరగాల్సిన మ్యాచ్ రద్దు అయితే. పాకిస్తాన్, శ్రీలంక జట్లకు చేరో పాయింట్ లభిస్తుంది.ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు ఉన్న ఈ జట్ల ఖాతాలలో మరో పాయింట్ చేరడం వల్ల మూడు పాయింట్స్ నమోదు అవుతాయి.శ్రీలంక (-0.200) మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఫైనల్ కు చేరుతుంది.పాకిస్తాన్ (-1.892) మెరుగైన నెట్ రన్ రేట్ లేని కారణంగా ఫైనల్ కు చేరుకోలేదు.

అయితే ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్- పాకిస్తాన్( India-Pakistan ) మధ్య ఫైనల్ మ్యాచ్ లేనట్టే.అలా కాకుండా నేటి మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే.ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్-పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగనుంది.

ఈరోజు వరుణుడు కరుణిస్తాడో, లేదంటే అడ్డుపడతాడో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube